హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతిరెడ్డి

 

హైదరాబాద్‌ సెప్టెంబర్ 24(globelmedianews.com)    
నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి పేరు ఖరారైంది. పద్మావతి రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌అభ్యర్థిగా పద్మావతిరెడ్డి పేరును ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 
హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతిరెడ్డి

2018 ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీగెలుపొందలేదు. కోదాడ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ గెలుపొందారు.2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి గెలుపొందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ స్థానం ఖాళీకావడంతో.. అక్టోబర్‌ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సైదిరెడ్డికి సీఎం కేసీఆర్‌ బీ ఫారం కూడా
అందజేశారు.

No comments:
Write comments