కలక్టరేట్ నిర్మాణాలకు పరిశీలించిన కలెక్టర్

 

ఒంగోలు, సెప్టెంబర్ 21, (globelmedianews.com):
జిల్లా కలెక్టరేట్ ను తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ప్రకాశం భవనంలో జరుగుతున్న పారిశుద్ధ్య
కార్యక్రమాల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా లో మాట్లాడుతూ ప్రకాశం భవనంలో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసే విధంగా వాతావరణంకల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. 
కలక్టరేట్  నిర్మాణాలకు పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం భవనంలో పరిశుభ్రత పాటిస్తూ ఎక్కడా కూడా చెత్తా చెదారం వేయకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయనఅధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని ఓపన్ ఆడిలోరియం వద్ద ఆ ప్రాతంమంతా కూడా చదును చేసి మట్టితో  ఎత్తు పెంచాలని ఆయన అన్నారు. ఓపెన్ ఆడిటోరియం వద్దసమావేశపు హాలును నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్ లో దక్షిణం వైపు వున్న పబ్లిక్ టాయ్ లెట్స్ ను తొలగించాలని ఆయన నగరపాలకసంస్థ కమీషనర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, సి.పి.ఓ .వెంకటేశ్వర్లు,  నగరపాలక సంస్థ కమీషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సుందరామిరెడ్డి, జిల్లా పర్యాటకశాఖ అధికార నాగభూషణం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటి మేనేజర్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments