పరిశుభ్రత విషయంలో గ్రామస్థులు భాగస్వాములు కావాలి

 

నాగర్ కర్నూలు సెప్టెంబర్ 13 (globelmedianews.com)
పరిశుభ్రమైన, ఆరోగ్య గ్రామాలే లక్ష్యంగా అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో గ్రామప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్కోరారు.  గ్రామ పంచాయతీలలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం ఆయన నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం చర్ల తిరుమలాపూర్ గ్రామంలో పర్యటించారు.గ్రామంలోని రహదారులు, మురికి కాలువలు, పాడుబడిన బావులు, విద్యుత్ స్తంభాలు తదితరాలను కలెక్టర్ పరిశీలించారు. 
పరిశుభ్రత విషయంలో గ్రామస్థులు భాగస్వాములు కావాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని రహదారులు, మురికికాల్వలను శుభ్రం  చేసుకునే విషయంలో గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని కోరారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లయితే వివిధ రకాల రోగాల బారిన పడేందుకు ఆస్కారం ఉందనిఅందువల్ల ఇంటితో పాటు, ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు.  గ్రామ సర్పంచ్ బోనాసి నరేందర్, ఎంపీటీసీసుజాత, ఉప సర్పంచ్ దశరథం, డిపిఓ సురేష్ మోహన్,డివిజనల్ పంచాయతీ అధికారి రామ్మోహన్, మండల ప్రత్యేక అధికారి మోహన్ రెడ్డి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఆంజనేయులు, ఎంపీడీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి మాసయ్య,విఆర్ఓ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

No comments:
Write comments