గులాబీలో అసంతృప్తులకు బుజ్జగింపులు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 11, (globelmedianews.com)
మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో చిచ్చుపెట్టింది. మంత్రి పదవులు దక్కకపోవడంతో పలువురు సీనియర్లు అలక బూనారు. నాయినీ నరసింహ్మారెడ్డి, జోగురామన్న, జూపల్లి కృష్ణారావు, రాజయ్య,అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నేతలు మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండడంతో టీఆర్ఎస్హైకమాండ్ రంగంలోకి దిగింది. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.అసంతృప్త నేతలకు ప్రగతి భవన్ నుంచి ఫోన్‌లు వెళ్తున్నాయి. 
 గులాబీలో  అసంతృప్తులకు బుజ్జగింపులు

రాబోయే రోజుల్లో గౌరవప్రదమైన పదవులుఇస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వడం కుదరడం లేదని..ఈసారి సర్దుకుపోవాలని చెప్పడంతో నేతలు దిగొస్తున్నారు. ఈ క్రమంలోనే రాజయ్య, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జూపల్లికృష్ణారావు తమ స్వరం మార్చారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని.. కేసీఆరే తమ నాయకుడని చెప్పుకొచ్చారు.కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యేతాటికొండ రాజయ్య వివరణ ఇచ్చారు. కేసీఆర్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనని ప్రశంసించారు. మాదిగలకు త్వరలోనే ఉన్నత పదవులు వస్తాయన్ననమ్మకం ఉందని స్పష్టంచేశారు. అటు జూపల్లి కూడా పార్టీ మార్పు ఊహాగానాలను ఖండించారు. టీఆర్ఎస్‌లో తన పని తాను చేస్తున్నానని.. సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మవద్దనిసూచించారు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సైతం మెత్తబడ్డారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి లేదని స్పష్టంచేశారు.

No comments:
Write comments