ఆర్ధిక మాంద్యానికి మద్యం మందు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 10 (globelmedianews.com)
ఆర్థిక ఇబ్బందులను అధిగమిం చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మద్యం ప్రియులు పెరిగారో లేక మద్యం షాపులు, బార్ల సమయాన్ని పొడగించినందునో కానీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణలో మద్యం అమ్మకాలకు పొంతనే లేదు. 2010-11 లో రూ. 49 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలతో 8,257 కోట్లు, 2011-12లో 9.20 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలతో రూ.9,612 కోట్లు, 2012-13లో 63 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలతో రూ.11,115 కోట్లు, 2014-15లో 80.23 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలతో రూ.13.056 కోట్ల ఆదాయం వచ్చింది. అదే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2016-17 లో 2.715 కోట్ల కేసుల లిక్కర్‌తో రూ. 16 వేల కోట్లు 2017-18 లో 2.960 కోట్ల కేసుల లిక్కర్‌ విక్రయాలతో రూ.20 కోట్ల్లు, 2018 -19లో 3.289 కోట్ల కేసుల లిక్కర్‌ విక్రయాలతో రూ. 23 వేల కోట్ల అమ్మకాలు జరిగాయి. 
ఆర్ధిక మాంద్యానికి మద్యం మందు

ఎక్సైజ్‌ డ్యూటీల రూపంలో ఒక మద్యం సీసా గరిష్ట అమ్మకంపు ధరపై 200 శాతానికి పైగా ఆదాయం ప్రభుత్వానికి చేరింది. మన వద్ద తయారైన విదేశి మద్యం అమ్మకంలో 13.4 శాతం మేర, బీరు అమ్మకంలో 40.4 శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్టు సమాచారం. మద్యం అమ్మకాలు ఏటా భారీగా పెరుగుతుండటం అంతే స్థాయిలో ఆదాయం లభిస్తుండటంతో దీన్ని మరింత ప్రోత్సహించేలా కేసిఆర్‌ సర్కార్‌ రంగం సిద్ధం చేస్తున్నది.రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడం, ఇప్పటి వరకు సుమారు రూ. 2.50 లక్షల కోట్ల అప్పు దానికి సుమారుగా సంవత్సరానికి రూ.12వేల కోట్ల వడ్డీ చెల్లించిరావటం సంకటంగా మారింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లకు నిధుల లేమి అడ్డంకిగా మారుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయ వనరులు కనుచూపుమేరలో కూడా లేకపోవడంతో ఆబ్కారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని సర్కారు భావిస్తున్నది. 2018..2019లో ఎక్సైజ్‌ శాఖ ఆదాయం గణనీయంగా పెరగడంతో 2019-2020 కి సంబంధించి ఆ శాఖ నుంచి సుమారు రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుగాను కొత్త మద్యం షాపుల లైసెన్స్‌ ఫీజులు, స్లాబు ధరలు, మద్యం విక్రయాలు ఎక్కువగా ఉన్న చోట అదనపు దుకాణాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే నూతన ఆబ్కారీ విధానంపై సర్కారు కసరత్తు ప్రారంభించింది.లిక్కర్‌తో పోలిస్తే బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. 2016 లో 2,715 కోట్ల కేసులు, 2017లో 2,968 కోట్ల కేసులు, 2018లో 3,287 కోట్ల కేసులు, 2019 జులై వరకు 3.340 కేసుల బీర్లు అమ్ముడయాయి. ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 వేల బీర్ల కేసులు పెరుగుతున్నట్టు ఎక్సైజ్‌ గణాంకాలు చూపుతున్నాయి.రాష్ట్రంలో ప్రస్తుతం 2,218 మద్యం షాపులు ఉన్నాయి. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో మండలానికి రెండు మద్యం దుకాణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే జరిగితే రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 3,200 వరకు చేరుకునే అవకాశం ఉంది. దీని ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

No comments:
Write comments