తెలంగాణకు తరలిపోతున్న ఇసుక

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 25  (globelmedianews.com)
ఏపీలో ఇసుక వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చినా.. కొరత ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ నుంచి ఇసుక తెలంగాణకు తరలిస్తున్నారని.. ఏపీలో మాత్రం ఇసుక రేట్లు భారీగా పెంచేశారని మండిపడుతున్నారు. ఇసుక లేక లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు. 
తెలంగాణకు తరలిపోతున్న ఇసుక

జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు.‘తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇసుక రేటెంత? వైసీపీ వచ్చాక రేటు ఎంతకు పెరిగింది? నాలుగు నెలల్లోనే ఇసుక రేటు నాలుగైదు రెట్లు ఎలా పెరిగింది? పెరిగిన ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ’అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు. భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రధానంగా ప్రస్తావించారు‘ఇసుక లేక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. 20లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రజలకు సరఫరా చేసేందుకు వరదలు అడ్డొస్తే... మరి అనంతపురం మీదుగా కర్ణాటక తరలిపోతున్న ఇసుక ఎక్కడిది? జగ్గయ్యపేట మీదుగా తెలంగాణకు తరలిపోతున్న ఇసుక ఎవరిది?’అంటూ నిలదీశారు టీడీపీ అధినేత.

No comments:
Write comments