వేణుమాధవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం

 

హైదరాబాద్ సెప్టెంబర్ 25   (globelmedianews.com)
ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతితెలిపారు. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. 
వేణుమాధవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం

ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం కేసీఆర్ ఆ భగవంతుడిని ప్రార్థించారు. కాలేయ సంబంధ వ్యాధితోబాధపడుతున్న వేణుమాధవ్‌కు కిడ్నీల్లో సమస్యలు రావడంతో ఆయనను ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 12:21నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు.

No comments:
Write comments