బతుకమ్మ చీరల పంపిణీ షురూ...

 

తోబుట్టువులకు చీరలు
హైద్రాబాద్, సెప్టెంబర్ 23, (globelmedianews.com)
చంద్రుడికో నూలుపోగు అన్నట్లుగా తెలంగాణ ఆడపడచులకు చిరుకానుకగా చీరలను ఇస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ తోబుట్టువుగా, పెద్దన్నగా నిలిచారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (సెప్టెంబర్ 23) ఉదయం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నల్లగొండ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. తద్వారా నేతన్నల జీవనోపాధికి తోడ్పడిన వాళ్లమవుతామని చెప్పారు.మహిళలకు నచ్చిన చీరలు తేవడం భర్త వల్ల కూడా సాధ్యం కాదు. కానీ, ఏటికేడు చాలా కష్టపడి నేతన్నలు చాలా చక్కని చీరలు తయారు చేశారు. 
బతుకమ్మ చీరల పంపిణీ షురూ...

ఆడబిడ్డలందరూ బతుకును గౌరవించుకునే పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్ చిరు కానుక అందిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. పెద్ద మొత్తంలో చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.బతుకమ్మ చీరెల తయారీ మాత్రమే కాకుండా, బడి పిల్లల యూనిఫాంలను కూడా నేతన్నలకే అప్పజెప్పామని కేటీఆర్ తెలిపారు. యూనిఫాంలు వేసుకునే సింగరేణి, ఆర్టీసీ సంస్థలతో కూడా మాట్లాడి వాటి తయారీని కూడా నేతన్నలకే అప్పజెప్తామని చెప్పారు. నేత కార్మికులకు మెరుగైన జీవన ప్రమాణాలు స్థాపించే దిశగా ముందుకెళ్తున్నామని అన్నారు. బతుకమ్మ చీరెల ద్వారా నేతన్నల ఆదాయం రెట్టింపు అయిందని తెలిపారు.‘దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం పథకాలు తీసుకురాలేదు. చేనేత మిత్ర పేరుతో రాష్ట్రంలో నేతన్నలందరికీ భరోసా ఇస్తున్నాం. రసాయనాలు, నూలు, అద్దకానికి వాడే వస్తువులను 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నాం. నేతన్న చేయూత పేరుతో వారి కుటుంబాల కోసం మరో పథకం అమలు చేస్తున్నాం. చేనేత లక్ష్మీ పేరుతో మరో కార్యక్రమం తీసుకువచ్చాం’ అని కేటీఆర్ తెలిపారు.వరంగల్‌లో అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కును తీసుకువస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది ప్రతి సోమవారం కచ్చితంగా చేనేత వస్త్రాలు ధరించాలనే నిర్ణయం తీసుకుని.. ఆచరించి చూపిస్తున్నామని కేటీఆర్ గుర్తుచేశారు2001, 2002 సంవత్సరాల సమయంలో పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి ఉద్యమ నాయకుడు, నేటీ సీఎం కేసీఆర్‌.. ఆ కుటుంబాలకు సాయం చేయండి, బతుకు మీద భరోసా కల్పించాలని అడిగితే నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్వయనా కేసీఆరే జోలె పట్టుకుని తిరిగి డబ్బులు అడిగి.. ఏడు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేశారు. నేతన్నలకు జీవనోపాధి కల్పించాలని ఆనాడే ఆయన సంకల్పం తీసుకున్నారు’ అని కేటీఆర్ చెప్పారు.ఎన్నికల సందర్భంగా అందిస్తున్న చీరలు కావని మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చమత్కరించారు. ఉమ్మడి నల్గొండ పరిధిలోని హుజూర్ నగర్‌ ఉపఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి నెలకొన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము పంపిణీ చేస్తున్న చీరలు బతుకమ్మ పండుగ నేపథ్యంలో సీఎం కేసీఆర్.. తెలంగాణ ఆడపడచులకు అందజేస్తున్న కానుకలని చెప్పారు.
వరంగల్ లో
తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని కడుకుంట్ల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారనీ, ప్రజలకు మంచి చేసే ఏ పనినైనా సీఎం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. పండుగ రోజు రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచూ కొత్త బట్టలతో కళకళలాడుతూ ఉండాలని ఆకాంక్షించారు.చీరల పంపిణీతో పాటు మహిళలకు మంత్రి ఓ మొక్కను కూడా బహూకరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మొహంతి, జెడ్పీ ఛెర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అదిలాబాద్ లో
తెలంగాణ ఆడపడుచులను బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి గౌరవించుకునేందు కోసం ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ల‌క్ష్మ‌ణ‌చాంద మండ‌ల కేంద్రంలో మ‌హిళ‌ల‌కు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ...దసరా కానుకగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆడుపడుచులందరికీ సారే పెడుతుందన్నారు.ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈ సారి కూడా దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తున్నామ‌ని తెలిపారు. వందకు పైగా డిజైన్లలో నాణ్యమైన చీరలను తయారు చేయించినట్లు వివ‌రించారు. ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించిదన్నారు. అంత‌కు ముందు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణం నందిగుండంలో దుర్గ‌మాతకు తొలి బ‌తుక‌మ్మ చీర‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌ల‌క్ష్మి, క‌లెక్ట‌ర్ ప్ర‌శాంతి, జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ ఎర్ర‌వోతు రాజేంద‌ర్, ల‌క్ష్మ‌ణ‌చాంద సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
మంత్రి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోటి మంది ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ జరుగుతుందన్నారు.కార్మికులు చేనేతకు పూర్వవైభవం తెస్తూ బతుకమ్మ చీరలను అందంగా తయారు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాల వారి కోసం పోచంపల్లిలో జోలెపట్టి అండగా ఉన్న ఉద్యమ నాయకడు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా చేనేతలు నేసిన బట్టలు అందజేస్తున్నాం. నేతన్నలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే ప్రభుత్వ కర్తవ్యం. చేనేత లక్ష్మీ పేరుతో నేతన్నల ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తున్నం. ప్రతి సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులు చేనేత దుస్తువులను ధరిస్తున్నారు.నల్లగొండపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉంది. నల్లగొండ, సూర్యపేటల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. యాదాద్రి ఆలయాన్ని అబ్బురపడే విధంగా పునర్ నిర్మాణం చేస్తున్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు, చౌటుప్పల్ ఇండస్ట్రీయల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నాయి. రైతుల ఆత్మహత్యలు ఇక లేవు... చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇక ఉండవు. 35 వేల కోట్ల రూపాయలతో నల్లగొండలో పనగల్ రిజర్వాయర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

No comments:
Write comments