మళ్లీ పురివిప్పుతున్న స్వైన్ ఫ్లూ లక్షణాలు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 28, (globelmedianews.com)
చలి వాతావరణంతో కూడిన సీజన్‌ ప్రారంభం కాగానే...వ్యాధి నెమ్మదిగా బయట పడుతోంది. చల్లని వాతావరణంలో   వ్యాధి వైరస్‌ విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోదీని బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు కన్పిస్తే 48 గంటల్లో చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా నియంత్రించవచ్చని చెబుతున్నారు .ముఖ్యంగా సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ మధ్య తేడా గుర్తించడం వల్ల త్వరితగతిన చికిత్స అందించడానికి వీలు కలుగుతుంది. సాధారణ ఫ్లూలో జలుబు, దగ్గు, తుమ్ములు,ముక్కు కారడం, గొంతునొప్పి, కొద్దిగా జ్వరంగా ఉంటాయి. 
మళ్లీ పురివిప్పుతున్న స్వైన్ ఫ్లూ లక్షణాలు

రెండు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. స్వైన్‌ఫ్లూలో తీవ్రమైన జ్వరంతోపాటు ఆయాసం, జలుబు, దగ్గు, తుమ్ములు,ముక్కు కారటం... కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు, నిస్సత్తువ లక్షణాలు కన్పిస్తుంటాయి. రోజురోజుకు ఇవి పెరుగుతుంటాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తక్షణం వైద్యులనుసంప్రదించాలి. పరీక్షలు చేసి స్వైన్‌ఫ్లూఅవునో...కాదో...నిర్ణయిస్తారు. చికిత్స అందడంలో ఆలస్యమైన కొద్దీ కొన్నిసార్లు అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రస్‌ సిండ్రోమ్‌(ఏఆర్‌డీఎస్‌)గా మారుతుంది.అప్పుడు కృత్రిమ శ్వాస అందించాలి. ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తుల నుంచి మూత్ర పిండాలు ఇలా అన్ని భాగాలకు వ్యాపిస్తాయి. కొన్నిసార్లు మరణమూ సంభవించొచ్చు. వ్యాధి నిరోధక శక్తితక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో ఈ తరహా లక్షణాలు కన్పిస్తే ఏమాత్రం నిర్లక్ష్యంచేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం మేలు.అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు స్వైన్‌ఫ్లూ వైరస్‌ ప్రభావం ఎక్కువ. ఈ కాలంలో పర్యాటక, ఇతర ప్రాంతాలకు వెళ్లక పోవడమే మంచిది. ఎక్కువమంది గుమిగూడిన ప్రాంతాల్లో వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని గుర్తించాలి. సినిమా హాళ్లు, ఫంక్షన్లు, మార్కెట్లకు వెళ్లినప్పుడు అక్కడ తలుపులు, బల్లలు, కుర్చీలు తాకేందుకుఅవకాశం ఉంటుంది. అవే చేతులతో ఇంటికొచ్చి అన్ని వస్తువులను తాకకుండా కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో చేతులపై స్వైన్‌ఫ్లూ వైరస్‌ ఉంటే వెంటనే పోతుంది.  చేతిశుభ్రత పై అవగాహన ఉండాలి. ఇతరులకు కరచాలనం బదులు నమస్కారం పెట్టడం మంచిది. ఒకవేళ ఇతరుల చేతిలో స్వైన్‌ఫ్లూ వైరస్‌ ఉంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది.బయటకు వెళ్లినప్పుడు చేతి శుభ్రత కోసం శానిటైజర్లు వాడటం చాలా అవసరం.  ఇంట్లో ఒకరికి స్వైన్‌ఫ్లూ సోకినప్పుడు మిగతా వారు జాగ్రత్తగా ఉండాలి. వారిలోనూ లక్షణాలు కన్పిస్తేవెంటనే చికిత్స తీసుకోవాలి. బయట తిరగకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇతరులకు సోకకుండా చూడవచ్చు.  చిన్నపిల్లలు, వృద్ధులు, అవయవాల మార్పిడి చేయించుకున్నన వారు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు స్వైన్‌ఫ్లూ టీకా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

No comments:
Write comments