ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వెదురు

 

ప్రణాళికలు సిద్దం చేస్తున్న ఉద్యానవనశాఖ
ఖమ్మం, సెప్టెంబర్ 7, (globelmedianews.com)
పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో వాతావరణంలో అనేక మార్పులొ స్తున్నాయి. ప్లాస్టిక్‌ మహ్మరి ఇందుకు అవరోధంగా మారింది. దీనికి ప్రత్యా మ్నాయంగా వెదురును ప్రోత్సహించేలా ఉద్యానవన శాఖ సన్నద్ధమవుతున్నది.రాష్ట్రంలోని పలు అడవుల్లో ఇప్పటికే వెదురు కుందుళ్లు విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌ తదితర జిల్లాల్లో ఎక్కువగా ఎదురు కుందుళ్లు ఉన్నాయి. రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఎత్తున వెదురు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 
ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వెదురు

గతంలో వెదురు చెట్లను నరకాలన్నా, అక్రమంగా తరలించాలన్నా అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నది. ఈ నిబంధనను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో వెదురు సాగు ప్రోత్సాహానికి అవకాశాలు మెరుగుపడ్డాయని అధికారులు భావిస్తున్నారు. వెదురు కలపతో వివిధ రకాల వస్తువుల తయారీలో శిక్షణ కల్పించడం, వెదురుపై ఆధారపడిన కుటుంబాల నైపుణ్యాన్ని మెరుగుపరడం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు ఉద్వానవన శాఖ అధికారి చెప్పారు. ఈ-మార్కెటింగ్‌ సదుపాయం కల్పించనున్నారు. వెదురు ఉత్పిత్తిదారులతో సంఘాల ఏర్పాటుకు చేసి, వస్తువుల తయారీదారుల సంఘాలకు సబ్సిడీపై వెదురు అందించాలని అధికారులు భావిస్తున్నారు.  అందుకు గానూ రైతులకు ప్రత్యేక రాయితీలిచ్చి భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. వెదురు లంకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నేషనల్‌ బ్యాంబు మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా వెదురు వనాలను పెంచడానికి కసరత్తు ప్రారంభించింది. వెదురు మొక్కల పెంపకం, వెదురు ఆధారిత కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడానికి జాతీయ వెదురు మిషన్‌ను ఏర్పాటైంది. వెదురు సాగు కోసం రాష్ట్రంలో రూ.11కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. వెదురు సాగు చేయడం, మద్దతు ధర కల్పించడం తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవనోపాధిని మరింత మెరుగుపర్చడం, వెదురు ఉత్పత్తులను మార్కెట్‌ చేయడం బ్యాంబు మిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా తెలంగాణ రైతాంగానికి వెదురు ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. రైతులకు అవగాహన కల్పించి, వారి పంట పొలాల గట్ల వెంట ఈ వెదురు మొక్కలను పెంచాలని నిర్ణయించింది. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రోత్సహించాలని భావిస్తున్నది. వెదురు సాగు చేసే రైతన్నలకు ఒక్కో వెదురు మొక్కకు రూ 240 చొప్పున ప్రోత్సాహం అందించనుంది. వెదురు మొక్కలు నాటడానికి గుంతలు తవ్వడం, ఎరువులు, సాగు చేయడానికి అంతా కలిపి రూ 240 వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెదురు మొక్కకు రూ 35 నుంచి రూ 40వరకు ఖర్చవు తుంది. మొదటి ఏడాది 50 శాతం రాయితీ, రెండో ఏటా 30శాతం, మూడో ఏడాది 20శాతం చొప్పున రైతుకు రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఎకరాలో 250 మొక్కలు నాటేలా ప్లాన్‌ చేసింది. వెదురు లంకలు అడవుల్లో సహజంగా పెరుగుతాయి. రాష్రంలో వాతావరణం అందుకు అనుకూలంగా ఉన్నది. అడవుల్లోంచి, రైతు పొల్లాలో సాగు చేయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 8 లక్షలా 30వేల వెదురు మొక్కలను నాటాలని ఉద్యానవనశాఖ సన్నాహాలు చేస్తున్నది. వెదురు ఒకసారి నాటితే దశాబ్దాల తరబడి దిగుబడి వస్తున్నది. కానీ, బుట్టల అల్లికలకు, భవన నిర్మాణాలకు మాత్రమే పరిమితమైంది. ఇండ్లల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌ బదులుగా గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల్లో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురును అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే పలు ఈశాన్య రాష్ట్రాల్లోని మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రజల జీవనంలో వెదురు అంతర్భాగమైందని అధికారులు అంటున్నారు. అక్కడైతే ఇండ్లలోనే వెదురు పెంచుతున్నారు. వెదురుబొంగులతో తయారు చేసిన అందమైన ఫర్నీచర్‌ పట్ల పట్టణవాసులు ఆసక్తి చూపుతున్నారు. బొమ్మలు, ఫెన్‌బాక్స్‌లు, కూరగాయల బుట్టలు, సోఫాలు, టీపారులు, హ్యాంగింగ్‌ చైర్‌లుతోపాటు కర్టెన్లు, క్యాండిల్‌ స్టాండ్‌లు, టోపీలు, పూలకుండీలు, అందమైన దీపాలు తదితర వస్తువులను తయారు చేసే అవకాశం ఉన్నది. వెదురు ఉత్పత్తులు తయారు చేసే వారికి శిక్షణ కల్పించి నైపుణాలను పెంచడానికి మంచి అవకాశాలున్నాయని, తద్వారా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం కానుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.

No comments:
Write comments