అంగన్ వాడీలలో మౌలిక వసతులు

 

సమీక్షా భేటీలో కలెక్టర్
ఏలూరు  సెప్టెంబర్ 20, (globelmedianews.com)
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదోడ్లు, విద్యుత్ సరఫరా సదుపాయలు తప్పని సరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని ఐసిడిఎస్ ప్రోజెక్ట్లలో అమలౌతున్నకార్యక్రమాల వారంతపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలొ నూరు శాతం మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు ఇంకా 271మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, ఈ పనుల మంజూరు కొరకు ప్రతిపాదనలు సమర్పించాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. 
అంగన్ వాడీలలో మౌలిక వసతులు

అలాగే 571 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా కల్పించాల్సిఉందని, ఇందుకు ఆయా పంచాయితీల ద్వారా కనెక్షన్ రుసుము చెక్కులు సేకరించి సరఫరా నిమిత్తం వెంటనే ట్రాన్స్కోకు పంపాలని తెలిపారు. అన్నిఅంగన్కేంద్రాలలో బరువు తూచే మిషన్లు తప్పకఉండాలని, పనిచేయని స్థితిలో ఉన్న 2482 మిషన్ల స్థానంలో క్రొత్త మిషన్ల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను పనివేళల ప్రకారం సక్రమంగా తెరిచి, నమోదైనపిల్లలందరూ హాజరైయ్యేట్లు చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలు, యుక్తవయసు ఆడ పిల్లలు, 6 ఏళ్లలోపు చిన్నారులకు పోషకాహారం, రక్తహీనత నివారణ, ఆరోగ్య పరిరక్షణ కొరకు కేంద్ర,ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు జిల్లాలో లక్ష్యిత ప్రజలందరికీ సమగ్రంగా చేరేలా పర్యవేక్షించేందుకు వారందిరి సమాచార గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఈ నెల 23 నుండి మూడు రోజులపాటు ఇంటింటి సందర్శన ద్వారా డేటా సేకరించి ఆన్లైన్లో అప్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐసిడిఎస్ పిడి కె.విజయకుమారి, సిడిపిఓలు పాల్గొన్నారు.

No comments:
Write comments