అభ్యంతరకరంగా ఉన్న స్తంభాలను తొలగించాల్సిందే: విహెచ్ పి

 

హైదరాబాద్  సెప్టెంబర్ 7  (globelmedianews.com)
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయ స్తంభాలపై కెసిఆర్ చిత్రం ,టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు, ప్రభుత్వ  పథకాల చిహ్నాలు మరియు చార్మినార్ గుర్తులు చెక్కడాన్ని విహెచ్పితీవ్రంగా ఖండిస్తుంది.
అభ్యంతరకరంగా ఉన్న స్తంభాలను తొలగించాల్సిందే: విహెచ్ పి

కెసిఆర్ తను చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకుని యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి వారికి క్షమాపణ తెలపాలని విహెచ్పి డిమాండ్ చేస్తుంది.ప్రభుత్వం లోని టిఆర్ఎస్ పార్టీపవిత్ర పుణ్యక్షేత్రాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుందని, అభ్యంతరకరంగా ఉన్న స్తంభాలను తొలగించాల్సిందే లేదంటే భక్తులే ఉద్యమించితొలగిస్తారని విహెచ్పి స్పష్టం చేస్తుంది.

No comments:
Write comments