రైతులకు గులాబీ రంగు పురుగు నివారణపై సదస్సు

 

కౌతలం సెప్టెంబర్ 20 (globelmedianews.com)
పత్తి పంటలో ఏర్పడే గులాబి రంగు పురుగు పై అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమం ను ఏర్పాటు చేశారు.మండల కేంద్ర పరిధిలో ఎరిగేరి, తోవి, బడినే హాల్ గ్రామాల వ్యవసాయ శాఖ,రిలయన్స్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ సి ఆర్ పి శ్రీనివాసులు  
రైతులకు గులాబీ రంగు పురుగు నివారణపై సదస్సు

రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలో ఎర్ర రేగడి, వరి సాగు పంటపొలాలలో నల్లరేగడి పొలాలలో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారని,పత్తి పంటకు గులాబీ రంగు పురుగు యొక్క బెడద అధికంగా ఉందని తెలియజేశారు.వీటి నివారణ కొరకులింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు తెలియజేశారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటను సాగు చేయడం వలన అధిక దిగుబడిని పొందవచ్చు అని రైతులకుతెలియజేశారు. పత్తి తీసిన పొలం లో గొర్రెలు మేకలు పశువులను మేపలని కోరారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి శ్రీనివాసులు, వ్యవసాయ సహాయ సంచాలకులు, సీబ్బంది,గ్రామ రైతులు, ఆదర్శ్రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments