ఐఆర్ సీటీసీలో టిక్కెట్ల మాఫియా

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 6, (globelmedianews.com)
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్లకు వరంగా మారింది. ఏజెంట్లే బినామీ పేర్లతో ఐడీలు సష్టించి అక్రమ దందాలకు పాల్పడుతున్నట్టు విజిలెన్స్‌ దాడుల్లో వెల్లడైంది. దక్షిణ మధ్యరైల్వేలో రోజూ లక్షలాది టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్న ఏజెంట్లు ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు. ఆన్‌లైన్‌ లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ అవుతున్న 60 నుంచి70 శాతం టికెట్లను ఏజెంట్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవడానికి ప్రయాణీకులకు అవకాశమున్నా.. టికెట్లు దొరకడం లేదు. ఎక్కు వ శాతం టికెట్లనునకిలీ ఐడీలతో ఏజెంట్లే బుక్‌ చేసుకుని అమ్ముకుంటున్నారు.ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మోసాలు విజిలెన్స్‌ విభాగం అధికారుల దాడుల్లో వెలుగు చూశాయి. 
 ఐఆర్ సీటీసీలో టిక్కెట్ల మాఫియా

దాడులు చేసిన ప్రతిసారీ పదుల సంఖ్యలోదళారులు దొరికిపోతున్నారు. వారి వద్ద భారీ మొత్తంలో ఆన్‌లైన్‌ టిక్కెట్లు పట్టుబడుతున్నా యి. ఆగస్టు 22, 23 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 49 పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోఆన్‌లైన్‌ ఏజెంట్ల వద్ద తనిఖీల్లో రూ.8.83లక్షల విలువైన టికెట్లు పట్టుబడ్డాయి. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న 49 మంది ఏజెంట్లను పట్టుకున్నారు. జూన్‌ 13న జోన్‌లోని 20 ప్రాంతాల్లోదాడులు నిర్వహించిన విజిలెన్స్‌ విభాగం అధికారులు రూ.11.66లక్షల విలువైన 896 ఈ-టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా విజిలెన్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో దాదాపురెండు వేల మంది ఏజెంట్లు పట్టుపడగా, రూ.36 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఏజెంట్లు ఇంత పెద్ద మొత్తంలో టికెట్లు బుక్‌ చేసుకోవడానికి రైల్వేవిభాగంలో పనిచేస్తున్న కొంత మంది అధికారులు, సిబ్బందే కారణమని విజిలెన్స్‌ విభాగం అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ విభాగం నివేదిక ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వేఅధికారులు, సిబ్బందిపై బదిలీ వేటేశారు. అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడిన అధికారి, సిబ్బందిని వేరే విభాగాలకు బదిలీ చేసినా ఏజెంట్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారని విజిలెన్స్‌విచారణలో తేలింది. రైల్వే ఖర్చులు తగ్గించుకుని భారతీయ రైల్వేకు ఆదాయం తెచ్చిపెడుతునప్పటికీ కొన్ని విభాగాల్లో ఇప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయని విజిలెన్స్‌ విభాగం నివేదికఅందజేసింది. ఆన్‌లైన్‌ టికెట్లలో మోసాలు, పార్కింగ్‌ పేరుతో ప్రయాణికులను నిలువు దోపిడీ చేయడం, పార్శిల్‌ విభాగంలో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు నివేదికలో పేర్కొంది. దీంతోరంగంలోకి దిగిన భారతీయ రైల్వే శాఖ.. విజిలెన్స్‌ విభాగానికి పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయో గుర్తించి చర్యలు తీసుకోవాలనిఆదేశించింది.ఐఆర్‌సీటీసీ గుర్తింపు పొందిన ఏజెంట్లు తత్కాల్‌ టిక్కెట్లు బుక్‌ చేసినప్పుడు అరగంట ఆలస్యంగా అనుమతిస్తారు. ఇక్కడే ఏజెంట్లు చేతి వాటం చూపిస్తున్నారు. ఏజెంట్లు తమ సొంతఐడీలు కాకుండా వేర్వేరు పేర్లతో ఐడీలు సష్టించి వందలాది టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారు. ఎక్కువ వేగం ఉన్న ఇంటర్నెట్‌ కనెక్షన్లతో క్షణాల్లో టిక్కెట్లు బుక్‌ చేసే అవకాశం ఉంటుంది. దాంతో డిమాండ్‌నుబట్టి టిక్కెట్‌పై 50 నుంచి 100 శాతం అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

No comments:
Write comments