నల్లమల్లలో యురేనియం భయం

 

నల్గొండ, సెప్టెంబర్ 10, (globelmedianews.com
ల్లమలలో యురేనియం చిచ్చు రగులుతున్నది. యురేనియం బోర్లు వేయటానికి సర్వే జరిపిన గ్రామాలైన ఉడిమిళ్ల, తిరుమలాపురం బీకే, మారడుగు గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, చెంచు పెంటల్లోని అడవిబిడ్డలు, చెంచులు నిద్రలేమిరాత్రులు గడుపుతున్నరు. ఎప్పుడేం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. యురేనియం రక్కసితో తమ ఊర్లు ఎక్కడ కనుమరుగైపోతాయో నన్న భయం నల్లమల అడవి బిడ్డలను వెన్నాడుతున్నది. ఇద్దరు ముగ్గురు యాడ కూసున్నా యురేనియం ముచ్చటే వినిపిస్తున్నది. తమ ఊర్ల ఎవ్వరు కొత్తోళ్లు కనిపించినా ప్రశ్నల వర్షం కురిపి స్తున్నారు. యురేనియం మాటెత్తితే చాలు...మునికాళ్ల మీద లేచి భగ్గుమంటున్నరు. మీకోసమే వచ్చామని నచ్చజెప్పేందుకు యత్నిస్తే... సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నల్లమల్లలో యురేనియం భయం

యురేనియం తవ్వకాల మిషన్లు వస్తే తగులబెడతాం మున్ననూరు చెక్‌పోస్టు దాటి ఒక్కడ్ని కూడాలోపలికి రానివ్వబోమని ఘంటా పథంగా చెబుతున్నారు. చెట్టూ, చేమా, అడవితల్లిని ఇడ్సి పోయే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నరు. తమ గోసను శ్రీశైలం, మద్దిమ డుగు వెళ్లే యాత్రికులకు తెలిసేలా, తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతం చేసేందుకు ఆదివాసీ బిడ్డలు దీక్షా శిబిరం పెట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలెట్టారు.. న'మన ఊరుబో తుందంట గదా కోడా? అడవినిడ్సి మనం బతుకుతమా కోడా? ఏం జేద్దాం? మీరేం చెప్తె గట్లనే నడుస్తం కోడా?ఊర్ల మాట్లాకుంటుంటే గుబులు గుబులు అయితాంది కోడా' అంటూ ఉడిమిళ్ల గ్రామానికి చెందిన 75 ఏండ్లకుపైగా ఉన్న వృద్ధురాలు ఆ గ్రామ యువకుడ్ని పట్టుకుని అడగటాన్ని బట్టి చూస్తేనే చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు తీవ్ర ఆందోళలనలో ఉండటాన్ని బట్టే ఆ గ్రామాల్లోని పరిస్థితి ఏంటో అవగతమవుతున్నది. అమ్రాబాద్‌, పరద మండలాల్లో ప్రతి రోజూ చెంచు పెంటల్లో, గ్రామాల్లో యురేనియ వ్యతిరేక కమిటీ అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. జాదుగూడ, చెర్నోబిల్‌, అమెరికాలో యురేనియం తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదాలు, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన అంశాలను వీడియోల ద్వారా చూపెడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

No comments:
Write comments