జూరాల ప్రోజెక్టు వద్ద మళ్ళీ పెరిగిన వరద

 

జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 5, (globelmedianews.com)
గురువారం ఉదయానికి జూరాల ప్రొజెక్టుకు మళ్ళీ వరద ప్రవాహం పెరిగింది.  ఎగువన కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి విడుదలవుతున్నది. 
జూరాల ప్రోజెక్టు వద్ద మళ్ళీ పెరిగిన వరద

ప్రస్తుతం జూరాల ప్రొజెక్టుకు 98,000 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నది. 8 గేట్లను ఎత్తివేసి దిగువన శ్రీశైలం ప్రొజెక్టుకు నీరు వదులుతున్నారు. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. గంట గంటకు జూరాల ప్రోజెక్టు వద్ద ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది.

No comments:
Write comments