శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికు ఆహ్వానం

 

ఎమ్మిగనూరు సెప్టెంబర్ 27  (globelmedianews.com)
పట్టణంలోని వాసవి మాత దేవాలయంలో ఈ నెల 29 వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికు ఆయన నివాసంలో
ఆర్యవైశ్య సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని వారు ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు. 
శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికు ఆహ్వానం

అదే విదంగా పట్టణంలోని పుర ప్రముఖులను కలిసి ఆహ్వానించినట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కే.పి శేషయ్య శెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం గౌ.సలహాదారులు కే.పి వీరన్న శెట్టి,నాగయ్య, అధ్యక్షులు మురహరి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి హరి, కోశాధికారి తిరుమల్, ఉప కార్యదర్శి నర్సయ్య శెట్టి, సభ్యులు శ్యామ్,సి.రమేష్,బిలాలి వీరేష్, బాలాజీ,టి.పి శ్రీనివాసులు, మహేష్,తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments