వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

 

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 27  (globelmedianews.com)
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కట్టా రవి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ సంక్షేమపథకాలు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 
వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

ఆనాడు కేసీఆర్  పాత పాలమూరు వీరన్న పేట, పాత తోట  లో పర్యటించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు హ హామీ నెరవేర్చలేదని, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 20,000 ల మంది డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు దారులు ఉన్నారని వారికిఇంతవరకు ఎలాంటి ఇల్లు కూడా మంజూరు కాలేదని అన్నారు. ఈ వచ్చే దసరా పండుగ లోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందకపోతే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, మాజీ కౌన్సిలర్ బాలస్వామి, ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిబాబా పాల్గొన్నారు.

No comments:
Write comments