అభిమానులకు షాకిచ్చిన ఇల్లీ

 

ముంబై, సెప్టెంబర్ 5  (globelmedianews.com)
సెలబ్రిటీలు రోజూ అభిమానులతో సమయం గడపడం కుదరని పని. అందుకే వారితో కనీసం సోషల్ మీడియా ద్వారానైనా టచ్‌లో ఉండాలని అనుకుంటారు. సమయం కుదిరినప్పుడల్లా వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానైనా ట్విటర్‌లోనైనా చాట్ సెషన్ ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని ఆగ్రహానికి గురిచేస్తుంటారు కొందరు నెటిజన్లు. తాజాగా గోవా బ్యూటీ ఇలియానాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె  ఇన్‌స్టాగ్రామ్‌లో  చిట్ చాట్ సెషన్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెబూతూ వారిని సంతోషపరిచారు. 
 అభిమానులకు షాకిచ్చిన ఇల్లీ

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌కు బుర్రలో వెధవ ఆలోచన తట్టింది. దాంతో ఇలియానాను ఓ అసభ్యకర ప్రశ్న అడిగాడు. ‘ఇలియానా.. నువ్వు ఎప్పుడు కన్యత్వం కోల్పోయావ్’ అని ప్రశ్నించాడు. ఇందుకు ఇలియానా తనదైన శైలిలో సమాధానం ఇచ్చి సదరు నెటిజన్ నోరు మూయించారు. ‘వావ్.. తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తు్న్నట్లున్నావ్. దీనికి మీ అమ్మ ఏమంటుంది?’ అని సమాధానం ఇచ్చి నోరుమూయించారు. ఇలాంటి నెటిజన్ల కారణంగా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా చిట్ చాట్‌కు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. వాటికి సమాధానం ఇస్తే ఎన్ని కామెంట్లు వస్తాయోనని ఆలోచించి చాటింగ్‌కు వెనకడుగు వేస్తు్న్నారు. గతంలో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఆమె ముంబయికి వెళ్లినప్పుడు కాస్త పొట్టి దుస్తులు వేసుకుని ఫొటోలు దిగింది. వీటిపై ఓ నెటిజన్ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘కారులో సెక్స్ కానిచ్చేది ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్లుంది’ అని కామెంట్ చేశాడు. దాంతో రకుల్‌కి ఒళ్లుమండిపోయింది. ‘కారులో మీ అమ్మ కూడా ఇలాంటి సెక్స్ సెషన్స్ బాగా చేస్తుందేమో. అందుకే ఈ విషయంలో నీకు బాగా అనుభవం ఉన్నట్లుంది. ఆ సెషన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు నీకు కాస్త బుద్ధి కూడా ప్రసాదించమని మీ అమ్మను అడుగు. కేవలం సమానత్వం, రక్షణ గురించి డిబేట్లు పెట్టగానే సరిపోదు. ఇలాంటివారు ఉన్నంత వరకు ఆడవారికి ఎక్కడా రక్షణ ఉండదు’ అని చెప్పి నోరూమూయించారు.

No comments:
Write comments