ఆర్.ఎం.పి ,పి.ఎం.పి లపై దాడులను ఆపాలి

 

గుర్తింపు ఇచ్చి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి
అర్ధరాత్రి మంత్రిని వేడుకున్న ఆర్ఎంపీలు
వనపర్తి సెప్టెంబర్ 23, (globelmedianews.com)
ప్రజలతో తత్స సంబంధాలు పెట్టుకొని వచ్చిన వైద్యాన్ని గ్రామీణ పేద ప్రజలకు అందిస్తున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్లపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలంటూ వనపర్తి జిల్లా కమిటీఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి విన్నవించుకున్నారు. జిల్లాలోని పలు మండలాలలో డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలుచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్నారంటూ ఆస్పత్రులను సీజ్ చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని సుమారు 300 మంది ఆర్.ఎం.పి ,పి.ఎం.పిడాక్టర్లు ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని బలభద్రయ్య ఫంక్షన్ హాల్ లో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. 
ఆర్.ఎం.పి ,పి.ఎం.పి లపై  దాడులను ఆపాలి

ఈ సందర్భంగా ఎంతో మంది సీనియర్ ఆర్ఎంపీ, పీ ఎం పీలు వారి వారి అభిప్రాయాలనువెలిబుచ్చుతూ జిల్లాలో ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పిదాలకు మనమంతా బలి పోతున్నామని వారు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూజిల్లాలోని అందరూ ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్లు ఐక్యంగా ఉండి సమస్యల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కూడా నిబంధనలకు లోబడప్రాక్టీస్ చేస్తే ఇలాంటి దాడులు జరగవని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు గుర్తింపు ఇవ్వడమే కాకుండా తగిన  ప్రాధాన్యత ఇచ్చేందుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి వినతి పత్రాన్నిసమర్పిద్దాం అంటూ అదే అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందిస్తూ తమపై జరుగుతున్న దాడులను . నిలిపి వేయాలంటూ మంత్రికి విన్నవించడంజరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేస్తున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యులు వారికి వారి గుర్తింపని, ఈ గుర్తింపు ఎవరి ఇచ్చింది కాదని, ఇది ప్రజలు ఇచ్చిన గుర్తింపని ఆయన అన్నారు. ఆర్.ఎం.పి పి.ఎం.పి లపై జరుగుతున్న దాడులపై కలెక్టర్, డిఎంఅండ్హెచ్ఓ లతో మాట్లాడి దాడులు జరగకుండా చేసి తగిన న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు ఆనంద్ తో పాటు కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక కార్యదర్శి స్వామి నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయుడు, లక్ష్మణ్, కాంత రెడ్డి లతోపాటు జిల్లాలోని అన్నిగ్రామాల ఆర్.ఎం.పి,  పి.ఎం.పి డాక్టర్ లు పాల్గొన్నారు.

No comments:
Write comments