ఆత్మీయులతో సైదారెడ్డి సమావేశం

 

నల్గొండ, సెప్టెంబర్ 26, (globelmedianews.com)
హుజుర్‌నగర్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాది కాలం పాటు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. మనం హెచ్చరించిన తర్వాత హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే వచ్చి సంతకాలు పెట్టిండు. ఇంతకు ముందు అట్లాంటి ఎమ్మెల్యే ఉండే. ఇప్పుడు ఉప ఎన్నిక రావడం.. మీరు, మనం, హుజుర్‌నగర్ చేసుకున్న అదృష్టం. 
ఆత్మీయులతో సైదారెడ్డి సమావేశం

ప్రజలంతా స్పష్టతతో ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.నియోజకవర్గమంతా గులాబీమయం అవుతోంది. ఊర్లకు ఊర్లు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాయి. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి పల్లె నమ్ముతోంది. ఈ ఉప ఎన్నిక మంచి అవకాశం. డబ్బులకు ఎవరూ లొంగిపోవద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్ధరాత్రి ఫోన్లు చేసి ప్రజలను మభ్య పెడుతున్నారు. అభివృద్ధి కోసం పోరాడే వాళ్లం. మనం అంటే ఏందో ఈ గడ్డ మీద చూపించాలి. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. టీఆర్‌ఎస్ గెలిస్తే ఏం అభివృద్ధి జరుగుతోంది ప్రజలకు వివరించాలి అని శానంపూడి సైదిరెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు.

No comments:
Write comments