ఇసుక విధానాన్ని తప్పు పట్టిన జ్యోతుల నేహ్రు

 

విజయవాడ,సెప్టెంబర్ 5, (globelmedianews.com)
ఇసుక పాలసీపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం అవగాహన లేని నిర్ణయం అని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు. గురువారం అయన వాయిస్. జగ్గంపేట లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇసుక పాలసీ టన్నుకురూ 375 ధర గా నిర్ణయించడం జరిగిందని, అలాగే .ట్రాన్స్ పోర్ట్  కిలోమీటర్ కి 4.90 ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందంన్నారు.ఇది ఏ రకంగా సరిపోతుందని, అది అవగాహన లేని నిర్ణయన్నారు. కేబినెట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 
ఇసుక విధానాన్ని తప్పు పట్టిన జ్యోతుల నేహ్రు 

అనుభవం తో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అవగాహన లోపంతో ఇది తప్పుడు పుంతలు తొక్కడానికి అవకాశం ఉంటుందన్నారు.  దానిని అదనుగా తీసుకుని ట్రాన్స్ పోర్ట్ యజమానులు, ప్రజాప్రతినిధులు అధికారులు, ఒత్తిడి వల్ల వినియోగదారుల కు పెనుభారం పడే అవకాశం ఉందన్నారు. సామాన్యుడి కి అందుబాటులో ఇచ్చేందుకే అంటున్నారు. ఇదెక్కడ సాధ్యమాన్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక జగ్గంపేట రావాలంటే 2450 రూపాయలు అవుతుందన్నారు. రవాణ  గిట్టుబాటు కాదని. గత ప్రభుత్వం కంటే తక్కువ కు ఇస్తున్నాం అని చెపుకోవడానికే తప్ప వేరేది కాదన్నారు.  మీరు తీసుకున్న పాలసీని పునరాలోచించాలి అని ఆయన సూచించారు. నేను పార్టీ మారుతున్నానని సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నాయని, అ వదంతులు నమ్మవద్దన్నారు.

No comments:
Write comments