ఏం సాధించారని ఆలయాలపై మీ చిత్రాలు:నిప్పులు చెరిగిన బట్టి

 

హైదరాబాద్ సెప్టెంబర్ 6 (globelmedianews.com)
రసమయిని చూసి ఈటల నేర్చుకోవాలని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. రసమయికి ఉన్న బాధ్యత కూడా మీకు లేదా అని ప్రశ్నించారు. పేరు మారింది తప్ప ఏమీ మారలేదని రసమయి చెప్పారన్నారు. ఎమ్మెల్యేకు ఉన్నంత ధైర్యం కూడా మంత్రులకు లేదా అని భట్టి ప్రశ్నించారు. 
ఏం సాధించారని ఆలయాలపై మీ చిత్రాలు:నిప్పులు చెరిగిన బట్టి

మంత్రులు తమ బాధ్యతలను నిర్వర్తించాలని.. తాబేదార్లుగా ఉండొద్దని సూచించారు.ఏం సాధించారని ఆలయాలపై మీ చిత్రాలు చెక్కుకుంటున్నారని భట్టి నిలదీశారు. ఇది రాజరికమా, ప్రజాస్వామ్యామా అని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయ స్థంభాలపై కేసీఆర్‌ చిత్రంటీఆర్‌ఎస్‌ గుర్తులా అని భట్టి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రాలు చెక్కండని సూచించారు. విష జ్వరాలతో ప్రజలు చనిపోతుంటే.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఈటల  అనడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌ ఓనర్‌షిప్‌పై కాదు ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని భట్టి సూచించారు.

No comments:
Write comments