ప్రొటెక్ట్ చేయడం తమ హక్కు..చట్టానికి లోబడే పోలీసులు పని చేయాలి

 

టీడీపీ అధినేత చంద్రబాబు
విజయవాడ సెప్టెంబర్ 19 (globelmedianews.com)
అక్రమంగా కేసులు పెట్టిన వారిని వదలం. ఎవరూ అధైర్యపడవద్దని, ఆంబోతు ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొందామని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులకు ధైర్యానిచ్చారు. డీజీపీ కూడా ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యారని, తానెవరికీ భయపడనని, ప్రజలతోనే ఉంటానని చెప్పారు. ప్రొటెక్ట్ చేయడం తమ హక్కు... చట్టానికి లోబడే పోలీసులు పని చేయాలన్నారు. తమ‌ నాయకులను ఉగ్రవాదుల్లాగా స్టేషన్లకు తిప్పుతారా అని ప్రశ్నించారు.
ప్రొటెక్ట్ చేయడం తమ హక్కు..చట్టానికి లోబడే పోలీసులు పని చేయాలి

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఎప్పుడో ఉన్న కేసుకు ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారా అని మరోసారి ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారిపై కేసు పెడతారా అని ప్రశ్నలు సంధించారు. గుంటూరు ఎస్పీ నీ బాధ్యతలు సక్రమంగా చేయి... పదవుల కోసం ఏకపక్షంగా వ్యవహరించొద్దని, పోలీసులు ప్రజల్లో చులకన కావద్దని, సమాజానికి మంచిది కాదని చంద్రబాబు సూచించారు. తన అధికారాలను ఉపయోగించి విచారణ చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరతామని చంద్రబాబు చెప్పారు.

No comments:
Write comments