వర్షభావ పరిస్థితులతో రైతులకు ఇబ్బందులు

 

కడప, సెప్టెంబర్ 10, (globelmedianews.com)
కడప జిల్లాలో నాలుగేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు.పండ్ల తోటలకు సాగుకు ఒక్కో మామిడి మొక్కకు రూ. 38.50, సపోటకు రూ. 48, సీతాఫలానికి రూ. 24.85, సన్న నిమ్మకు రూ. 24, చీనికి రూ. 57 చొప్పున అందిస్తున్నారు.మొక్కలు తెచ్చేందుకు రవాణా ఛార్జీలు, పొలంలో గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, నీటితడులు, ఎరువులు, పర్యవేక్షణ తదితర ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది.దీంతో రైతులు సాగుకుమొగ్గు చూపుతున్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి స్థిరమైన ఆస్తి, నిరంతర ఆదాయాన్ని సమకూర్చటానికి వీలుగా జిల్లాను ఉద్యాన హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి జగన్ జిల్లా అధికారయంత్రాగాన్ని ఆదేశించారు.
వర్షభావ పరిస్థితులతో రైతులకు ఇబ్బందులు

'వెలుగు’ ద్వారా ప్రభుత్వం ఉద్యానపంటల సాగుకు వంద శాతం రాయితీ ఇస్తోంది. దీంతో రైతులు పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది మెట్టరైతులకు కూడా అవకాశం కల్పించారు. దీంతో పండ్ల తోటల సాగు ఊపందుకుంటోంది. జిల్లాలో 3982 మంది రైతులకు 10584.74 ఎకరాల్లో పండ్ల తోటలు మంజూరయ్యాయి. 3855 మంది రైతులు9520.5 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వారు. ఇందు కోసం రూ. 730.92 లక్షలు ఖర్చు చేశారు. 1787 మంది రైతులు 4422.5 ఎకరాల్లో మామిడి, జామ, చీనీ, సన్ననిమ్మ,దానిమ్మ తదితర పంట తోటలు సాగు చేశారు. మామిడి సాగు చేసే రైతులకు 3 ఏళ్లపాటు ఎకరాకు రూ. 99,883 ఖర్చు చేస్తారు. ఎకరంలో 70 మామిడి మొక్కలు నాటుతారు.కలసపాడు మండలంఎగువ రామాపురానికి చెందిన రైతు కె.గోపాలరావు. ఈయన వెలుగు ద్వారా ఉద్యానవన పంటల సాగులో భాగంగా వారం క్రితం 2 ఎకరాల్లో బేనీషా రకం మామిడి మొక్కలు 140 నాటారు. ప్రభుత్వంగుంతలు తవ్వకం, మొక్కలు నాటేందుకు వందశాతం రాయితీ ఇవ్వడం సంతోషంగా ఉందని రైతు తెలిపారు. ఎంబీఏ చదివిన తాను ఆసక్తితో పండ్లతోటల పెంపకం చేపట్టానన్నారు. వ్యవసాయగొట్టపుబావిలో నీరు తగ్గడంతో బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీరు అందిస్తున్నానని రైతు తెలిపారు.

No comments:
Write comments