నేర‌స్థుడి స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకోరాదు

 

సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 24  (globelmedianews.com)    
నేరారోప‌ణ కేసుల్లో విచార‌ణ ఎదుర్కొంటున్న నేర‌స్థుడికి సంబంధించిన స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకోరాదు అని ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్‌,జ‌స్టిస్ దీప‌క్ గుప్తా, సంజీవ్ ఖ‌న్నాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. 
నేర‌స్థుడి స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకోరాదు

సీఆర్‌పీసీలోని 102వ సెక్ష‌న్ ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న వ్య‌క్తి ఆస్తుల‌ను అటాచ్ చేసేఅధికారం పోలీసుల‌కు లేద‌ని కోర్టు చెప్పింది. మ‌హారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన అభ్య‌ర్థ‌న‌పై ఈ కోర్టు ఈ విధంగా స్పందించింది. ఆస్తుల‌ను అటాచ్చేసే అధికారం పోలీసుల‌కు లేద‌ని ఓ కేసులో బాంబే హైకోర్టు పేర్కొన్న‌ది. దాన్ని మ‌హా ప్ర‌భుత్వం స‌వాల్ చేసింది.

No comments:
Write comments