నంద్యాలలో మంత్రుల పర్యటన

 

నంద్యాల, సెప్టెంబర్ 21(globelmedianews.com):
గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ముంపుకు గురైన ప్రాంతాలను పురపాలక, పట్టణాభివృద్ధి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ,కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం లు శనివారం పరిశీలించారు. మహానంది మండలం గాజులపల్లి గ్రామములో వరద ప్రభావిత ప్రాంతాలైన హరిజనపేట, మైనారిటీ కాలనీల్లోపర్యటించి వరద బాధితులను పరామర్శించారు. 
నంద్యాలలో మంత్రుల పర్యటన

నంద్యాల యం పి పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు మంత్రుల వెంట వున్నారు. ముంపుకు గురైన బాధితకుటుంబాలకు బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు వెంటనే పంపిణీ చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి ఆర్డీఓను ఆదేశించారు. వరద నష్టాన్ని పక్కాగా లెక్కించి నష్ట పరిహారంఅందిస్తామని బాధితులకు వివరించారు. వరదలకు దెబ్బతిన్న గృహాలు, పడిపోయిన గృహాలు, వరద నష్టాన్ని సరిగ్గా లెక్కించి నివేదికలు ఇవ్వాలని గ్రామ వలంటీర్లను ఆదేశించారు.ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డిపిఓ ప్రభకారరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments