నిర్మాణంలో వున్న వంతెన నేలమట్టం

 

రాజన్న సిరిసిల్లా సెప్టెంబర్ 20, (globelmedianews.com)
నాణ్యత లోపం, అధికారుల నిర్లక్ష్యం,  పాలకుల అలసత్వం వెరసి నిర్మాణంలో లో ఉన్నా బిడ్జి కూలి నేలమట్టమైంది. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మూలవాగు పై 16 కోట్లతో నిర్మించే రెండుబిడ్జి కి ఒక్కటి పూర్తి అయింది. రెండో బిడ్జి నిర్మాణం లో ఉంది. , నిన్న కురిసిన భారీ వర్షానికి మూల వాగు ప్రవహించగా బిడ్జి భీము విరిగి వాగులోకి ఒరిగింది. 
నిర్మాణంలో వున్న వంతెన నేలమట్టం

ప్రసిద్ది పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం   రాష్ట్ర ప్రభుత్వం ఈ బిడ్జిలను నిర్మించగా,  కాంట్రాక్టర్ ఒక్కటి పూర్తి చేసి రెండోదాని సగంలో వదిలేసాడు, దీంతో రాత్రి కురిసిన వర్షానికిబిడ్జి కూలిపోయింది.  బిడ్జి కూలిన విషయంతో పట్టణ ప్రజలు అక్కడ చేరుకొని  నాసిరకం మెటీరియల్ తో నిర్మించిన కాంట్రాక్టర్ పై, ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు.

No comments:
Write comments