ప్రభుత్వ ఆసుపత్రిలో రోటా వ్యాక్సిన్ వేసిన జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్

 

కొత్తకోట సెప్టెంబర్ 18 (globelmedianews.com )
తెలంగాణ ప్రభుత్వం యేడాది వయస్సు పిల్లలకు డయేరియా మరియు నీల విరేచనాలు అరికట్టేందుకు రోటా వైరస్ వ్యాక్సిన్ ను ఉచితంగా కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేసారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోటా వ్యాక్సిన్ వేసిన జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్

ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రిలో 1800 రూపాయలు ఉంటుందని కానీ తెలంగాణ ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తుందని కావున 1సంవత్సర లోపు ఉన్న పిల్లల తల్లిదండ్రులు దీనిని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక,సీడీసీ చైర్మన్ కోట్ల జగన్మోహన్ రెడ్డి,డాక్టర్ సౌజన్య  ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments