యుద్ధప్రాతిపదికన వరద సహాయక, పునరావాస చర్యలు

 

సురక్షిత పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
కలెక్టర్ వీరపాండియన్ ఆదేశం
కర్నూలు సెప్టెంబర్ 20  (globelmedianews.com)
నంద్యాల, ఆదోని డివిజన్ ల లో   పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, నదుల వద్ద ప్రజలు, వాహనాలు వరద ప్రవహహాన్ని దాటకుండా పోలీసు, విఆర్వో లను, గజ ఈతగాళ్లను పెట్టి ప్రాణ నష్టంజరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి నంద్యాల ప్రాంతంలో కుందూ, శ్యామ కాలువ, మహానంది వద్ద పాలేరు, వక్కిలేరు, రాళ్ల వాగుతో పాటు రుద్రవరం అలమూరు వాగు,  ఆదోని ప్రాంతంలో ..అన్ని మండలాల్లో స్థానిక వాగులు, వంకలను రైతన్నలు, ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు దాటకుండా ఆవగాహన కల్పించాలనిఅన్నారు.
యుద్ధప్రాతిపదికన వరద సహాయక, పునరావాస చర్యలు

జిల్లాలో నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్ లలో ఆకస్మిక వరదల పై జిల్లా అధికారులు, ఆర్డిఓలు, ఎస్ ఈ లు, మునిసిపల్ కమీషనర్ లు, తాశిల్దార్ లు, ఎంపిడిఓ లతో ఈ రోజు ఉదయం కర్నూలుకలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి వరద సహాయక చర్యలను అయన సమీక్షించారు.శుక్రవారం నంద్యాల డివిజన్ లో అహోబిలం, ఆళ్లగడ్డ, మహానంది, నంద్యాల టౌన్, రూరల్,  సిరివెళ్ల, గోస్పాడు, రుద్రవరం, గడివేముల, బండి ఆత్మకూరు, ఉయ్యాలవాడ, పాణ్యం, ఆదోని డివిజన్ లోఆదోని, హాలహర్వి, కోసిగి, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో, మండలాల్లో వర్షం ఎక్కువ కురిసింది. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టండని అధికారులను కలెక్టర్ఆదేశించారు.  జిల్లా అంతటా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. స్థానికంగా ఉండండి..వరద సహాయక చర్యలను కొనసాగించండి.. వరద సహాయక పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు సురక్షితఆహారం, నీరు సరఫరా, మెడికల్ క్యాంపు లను సమస్య లేకుండా కొనసాగించండని అన్నారు.వరద నీటితో నిండిన చెరువులకు గండి పడకుండా, ప్రజలకు ఎటువంటి ముంపు భయం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను ఆలస్యం ,ఆలసత్వం లేకుండా చేపట్టండి: ఇరిగేషన్ ఎస్ఈ,అధికారులను ఆదేశించారు. రోడ్డు కట్ అయిన చోట రాకపోకలకు ఇబ్బంది లేకుండా వెంటనే తాత్కాలిక పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండని  పీఆర్, ఆర్&బి ఎస్ ఈ లకు సూచించారు.అహోబిలం చెంచు కాలనీ తో పాటు ఇతర ప్రాంతాల్లో గ్రామాలు, కాలనీల్లో చేరిన వరద నీటిని బయటకు పంప్ చేయండని అన్నారు.  కలెక్టర్ టెలీ కాన్ఫెరెన్సు లో జెసి రవి పట్టన్ శెట్టి, జెసి2 సయ్యద్ఖాజా మోహిద్దీన్, డిఆర్ ఓ వెంకటేశం, ఆర్డీవో లు, జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గోన్నారు.

No comments:
Write comments