అక్కరకు వస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 26, (globelmedianews.com)
ఇదివరలో పాదచారులు రోడ్డు దాటుతుండగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే వారు కొందరుండగా…తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యేవారు ఇంకోందరు… కాళ్లు చేతులు విరిగి… వికలాంగులుగా మారిన పలువురి పరిస్థితి … అయితే గతేడాదిగా ఆలాంటి పరిస్థితి లేనేలేదు. ఆ రోడ్డులో ఒక్క అక్సిడెంట్ జరగలేదు. ఎవరికి ప్రాణ నష్ఠం జరగకపోవడం గమనార్హం…ఈ నేపద్యంలో ప్రజల ప్రాణాలు ఎంతో విలువైనవిగా గుర్తించి, శాశ్వత నివారణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకరించింది. పాదచారుల భద్రత, ముందుచూపు చర్యల వల్లనే వారు రోడ్డును అటు, ఇటు సురక్షితంగా దాటేస్తున్నారు. 
అక్కరకు వస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు

అదే పిక్చర్‌హౌస్ మహావీర్ ఆస్పత్రి. జెఎన్‌టీయు, ఎన్‌ఎండీసీ వరకు రెండు చోట్ల అటు ఇటు రోడ్డు దాటుతున్న బాటసారుల భద్రత కోసం లక్షల వ్యయంతో ఫూట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించింది.ఇక ఫూట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రజలకు రక్షణ కవచంగా మారాయి. అధికారుల చర్యల వల్ల సత్ఫలితాలు అందడంతోపాటు పాదచారుల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. ప్రజల భద్రత కోసం రూపుదిద్దుకున్న బ్రిడ్జిల వల్ల రోడ్డు ప్రమాదాలకు పూర్తిగా ముగింపు పలికినట్లే… బ్రిడ్జిల నుంచి కొద్ది దూరం వరకు అధికారులు రోడ్డు మద్యలో ఇనుప గ్రీళ్లు ఏర్పాటుచేశారు. దీంతో పాదాచారులు తప్పనిసరిగా మెట్లు ఎక్కి దిగాల్సిందే.. వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు 24 గంటలపాటు భయం లేకుండానే హాయిగా బ్రిడ్జిలు ఎక్కి దిగి తమ అవతల తమ గమ్యస్థలాలకు చేరుతున్నారు.మెహిదీపట్నం, బంజారాహిల్స్, విజయనగర్‌కాలనీ నుంచి వాహనాలు విపరీతంగా వేగంతో దూసుకొచ్చేవి.. 60 నుంచి70 కిలోమీటర్ వేగంతో దూసుకొచ్చి పాదచారులను బెంబేలెత్తించేవారు. వారి వేగానికి అదుపు తప్పి తరుచూ ప్రమాదాలతో రోడ్డు రక్తసిక్తమయ్యేది. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎందరో కాళ్లు చేతులు విరిగి ఆస్పత్రి పాలయ్యారు. వాహనాలు ఢీకొన్న పిల్లలు బాధ, నొప్పులతో విలవిలలాడేవారు.అయితే అదుపులేని వాహనాల వేగానికి రోడ్డు దాటాడమే పెద్ద సాహసమే… దీంతో గుంపులుగా ఇతరులను సమీకరించి అతి కష్ఠం మీద రోడ్డును దాటాల్సివచ్చేదని పలువురు చెబుతున్నారు. వృద్దులు, చిన్నారులను రోడ్డు దాటాలంటే తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి ఉండేది.. ఆలాంటి చేదు అనుభవాలు శాశ్వతంగా ముగిసాయి.

No comments:
Write comments