సమ్మె కు సిద్ధం అవుతున్న ఆర్టీసీ

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 10, (globelmedianews.com
ఆర్టీసీ పరిరక్షణ, పేస్కేలు అమలు, బడ్జెట్‌లో కనీసం ఒక్క శాతం నిధులు, ఐదేళ్ల లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్‌, ఆరు నెలల డిఎ పాతబకాయిల చెల్లింపు సహా 35 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టిఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యుఎఫ్‌) యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. శుక్రవారం ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ రాంచందర్‌, వీఎస్‌ రావులతో కూడిన ప్రతినిధి బృందం బస్‌భవన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మినిస్ట్రేషన్‌) వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీసును అందజేసింది.సెప్టెంబర్‌ 5వ తేదీ రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, భవిష్యత్‌ ఆందోళనను నిర్దేశిస్తూ కార్మిక బ్యాలెట్‌ నిర్వహించినట్టు ఈ సందర్భంగా తెలిపారు. కార్మిక బ్యాలెట్‌లో 11,966 మంది పాల్గొన్నారని, వారిలో 11,092 మంది ఆర్టీసీ పరిరక్షణ, పేస్కేలు కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని తెలియజేశారు. 
సమ్మె కు సిద్ధం అవుతున్న ఆర్టీసీ

కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా సమ్మె నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ఈనెల 19 నుంచి, లేదా ఆ తర్వాత ఏ తేదీ నుంచైనా సమ్మెలోకి వెళ్తామని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్‌ ద్వారా నిధులు ఇస్తామని, సంస్థ ఆప్పుల భారాన్ని తగ్గిస్తామని, బస్సుల కొనుగోలుకు నిధులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, సంస్ధను నిర్వీర్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఆ సొమ్మును ఇవ్వనందువల్ల దాదాపు 9వేల మంది కార్మికుల లోన్‌ ఆప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.భవిష్యనిధి (పిఎఫ్‌)ని మరో రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉందని, అవి ఇవ్వనందువల్ల రిటైర్‌ అయిన కార్మికులకు సకాలంలో డబ్బులు రావట్లేదని తెలిపారు. కార్మిక సమస్యలపై ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేశామని, యాజమాన్యం, ప్రభుత్వం ఎలాంటి పరిష్కారమార్గాలు చూపనందున సమ్మెలోకి వెళ్లాల్సి వస్తున్నదని అన్నారు

No comments:
Write comments