వాళ్ల నిర్మాణం.,. వీళ్ల కూల్చివేత

 

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల మధ్య సమన్వయ లోపం
కరీంనగర్, సెప్టెంబర్ 5, (globelmedianews.com)
ఎన్‌హెచ్, ఎన్‌హెచ్‌ఏఐ శాఖల మధ్య సమన్వయం కొరవడడం ప్రజలకు శాపంగా మారగా, ఏ శాఖ పరిధిలోకి ఈ రోడ్డు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రూ.32 కోట్లు వెచ్చించి చేసిన పనులో జవాబుదారీతనం లేకపోగా, అక్రమాలపై భుజాలు తడుముకోవడం, అధికారులు దాటవేసే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాగా.. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం ఏమీ పట్టించుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది.కరీంనగర్‌ మీదుగా వరంగల్‌ వరకు ఉన్న 70 కిలోమీటర్ల రహదారుల భవనాల శాఖ పరిధిలోని రోడ్డును నాలుగేళ్ల కిందటే జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌) పరిధిలోకి చేరుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు.
వాళ్ల నిర్మాణం.,. వీళ్ల కూల్చివేత

ఎన్‌హెచ్‌–563 నంబర్‌ సైతం కేటాయించారు. ఎన్‌హెచ్‌ పరిధిలోకి వెళ్లిన తర్వాత రహదారులు భవనాల శాఖ దీని నిర్వహణ నుంచి తప్పుకుంది. ఎన్‌హెచ్‌కు అప్పుడు స్థానికంగా కార్యాలయం, అధికారులు లేకపోవడం.. రహదారుల పరిస్థితిపై సరైన సమాచారం లేక రోడ్డు పూర్తిగా దెబ్బతినేంత వరకు మరమ్మతు చేయలేదు. ఈ రహదారి తమ పరిధిలో ఉన్నప్పుడు ఎన్‌హెచ్‌ విభాగం నుంచి నిధులు కేటాయించారు. మరమ్మతులు పూర్తయ్యాక రద్దీ దృష్ట్యా దీన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన పరిధిలోకి తీసుకుంది.ప్రస్తుతం కరీంనగర్‌ ఎన్‌హెచ్‌కు కార్యాలయం పర్యవేక్షణ ఇంజినీర్‌ ఉన్నారు. కానీ.. ఈ రహదారి ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉంది. దీంతో రహదారిపై ఎన్‌హెచ్‌ విభాగం పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ఫలితంగా రోడ్లలో నాణ్యత లోపించి దెబ్బతింటున్నాయి. అప్పట్లో రోడ్డు శిథిలమవడంతో ఎట్టకేలకు జాతీయ రహదారుల సంస్థ రంగంలోకి దిగింది. ఏడాదిన్నర క్రితం కరీంనగర్‌–వరంగల్‌ మార్గం లో పూర్తిగా దెబ్బతిన్న 48 కిలోమీటర్ల మేర మరమ్మతుకు రూ.32 కోట్లు కేటాయించింది. అంటే సగటున కిలోమీటర్‌ మరమ్మతుకు రూ.66.66 లక్షలు. గతేడాదిలో దశల వారీగా ఈ మరమ్మతులు చేశారు. కానీ.. మొత్తంగా ఏడాదిన్నర పూర్త య్యే లోపే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎక్కడపడితే అక్కడ గుంతలు పడ్డాయి. దీంతో హడావిడిగా అక్కడక్కడ అతుకులు వేశారు. మరమ్మతుల నిర్వహణ రెండేళ్ల వరకు చేపట్టాల్సిన కాంట్రాక్టరు చేతులెత్తడంతో అగమ్యగోచరంగా మా రింది. రహదారుల మరమ్మతుకు సంబంధించి కనీసం రెండు మూడేళ్లపాటు నిర్వహణ చేపట్టాల ని ఒప్పందం కుదుర్చుకుంటారు.ఇప్పుడు ఎవరూ సరైన దృష్టి పెట్టకపోవడంతో గుత్తేదారు సంస్థ అప్పనంగా గాలికి వదిలేసింది. పనులు చేస్తున్న సమయంలో సరైన పర్యవేక్షణ లేక నామమాత్రంగా చేపట్టడంతో గుత్తేదారుకు భారీగా ల బ్ధి చేకూరింది. ప్రజాధనం వ్యయమైనా వాహనదారులు, ప్రయాణికులకు ఫలితం దక్కలేదు. ని రంతరం ఎక్కడో ఒక చోట రోడ్డుకు మరమ్మతు చేయాల్సిన పరిస్థితి. పనులు చేసే సమయంలో నాణ్యమైన తారు వాడకపోవడం, సరిగా రోలింగ్‌ చేయకపోవడం, ఇంజినీర్ల పర్యవేక్షణ లోపంతో నాసిరకం పనులు చేపట్టడంతో రూ.కోట్లు వెచ్చిం చినా.. ఫలితం లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

No comments:
Write comments