కేసీఆర్ నియంతృత్వం

 

యాదాద్రి సెప్టెంబర్ 9, (globelmedianews.com)
యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ తన బొమ్మ సహా టీయారెస్ పార్టీ గుర్తును కూడా చెక్కించుకోవడం నియంతృత్వాపోకడకు నిదర్శనమని మాజీ ఎంపీ, బీజేపీ నేత జి. వివేక్ అన్నారు.చెక్కిన బొమ్మలను తొలగిస్తే సరిపోదని, ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
కేసీఆర్ నియంతృత్వం

సోమవారం ఉదయం అయన యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి స్తంభాలపై వివాదాస్పద చెక్కడాలను పరిశీలించారు. కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులుచెక్కించుకోవడం దారుణమన్నారు..

No comments:
Write comments