ఎవ్వరికి పట్టని ఈఎస్ ఐ ఆస్పత్రులు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 6, (globelmedianews.com)
ఈఎస్ ఐ ఆస్పత్రుల్లో అడగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో 16 లక్షల మంది లబ్దిదారులకు వైద్యసేవలందించేందుకు రాష్ట్రంలో నాచారంతో పాటు రామచంద్రాపురం, వరంగల్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ తదితర చోట్ల ఆస్పత్రులున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో 80 వరకు డిస్పెన్సరీలు, (వీటిలో కొన్ని ఈఎస్‌ఐసీ కార్పొరేషన్‌ నిర్వహణలో) ఉన్నాయి. అదే విధంగా దూర ప్రాంతంలో కొంత మందికార్మికులు ఉన్న చోట ప్యానెల్‌ క్లినిక్‌ల సదుపాయం కల్పించారు. అయితే నిధుల లేమి కారణంగా ఇవి కేవలం దిష్టిబొమ్మలుగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. 
ఎవ్వరికి పట్టని ఈఎస్ ఐ ఆస్పత్రులు

సిబ్బంది కొరత కారణంగారోగులకు మెరుగైన సేవలందడం లేదు. మరో 200 నుంచి 300 మంది వరకు వైద్యులు, 700 నుంచి 800 మంది వరకు నర్సులు అవసరమవుతారని నాచారం ఇఎస్‌ఐ డాక్టర్లు, నర్సింగ్‌సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో 42 మంది స్పెషలిస్టు డాక్టర్లకు పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ వారిలో సగం మంది కూడా జాయిన్‌ కాలేదు. జీతం తక్కువగా ఉండడం,సౌకర్యాలు కల్పించకుండా పట్టణ ప్రాంతాల్లోకి వెళ్లాలనడంతో ఇఎస్‌ఐలో సేవలందించేందుకు వైద్యులు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. నాచారం ఆస్పత్రి, వివిధ డిస్పెన్సరీలలో అందుతున్నసేవలపై ఇఎస్‌ఐ లబ్దిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సీజన్‌లో డెంగ్యూ, వైరల్‌ ఫీవర్‌ కేసులు ఎక్కువగా వస్తాయని తెలిసినా సరిపడా యాంటీబయాటిక్స్‌ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. రోగనిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పలుమార్లు టెస్టులను వాయిదా వేస్తున్నట్టు తెలిసింది. సిబ్బంది విషయానికి వస్తే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌సిబ్బంది తక్కువగా ఉన్నా, చాలా కాలం నుంచి పోస్టులను భర్తీ చేయడం లేదు. 10 మంది వైద్యులు పని చేయాల్సిన చోట ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. కొన్ని నెలల నుంచి షుగర్‌ వ్యాధికిఇంజెక్షన్లు లేవని చెబుతున్నారు. ఒక్కో ఇంజెక్షన్‌ రూ.150 వరకు ఖర్చు అవుతుంది. నెలకు కనీసం మూడు ఇంజెక్షన్లు వేసుకోవాలి. దానికి తోడు ఇప్పుడు టాబ్లెట్లు కూడా బయటే కొనుక్కోవాలి.ప్రతి నెలా ఇంజెక్షన్లకు దాదాపు రూ.500 వరకు ఖర్చు పెట్టుకుంటాం. ఈ నెలలో వాటితో పాటు మందులు కూడా లేవంటున్నారు. ఇప్పుడు వాటిని కూడా బయట కొనుక్కోవాలి. నడుం నొప్పి,మోకాలి నొప్పి ఏది చెప్పినా వాటికి అవసరమైన మందులు లేవని వెనక్కి పంపిస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇఎస్‌ఐ ఎందుకు?. గతంలో ఈఎస్‌ఐ ఉందనే ధైర్యముండేది. ఇప్పుడలా లేదనిబాధితులు వాపొతున్నారుకాలు నొప్పి ఉందని వైద్యులకు చూపించాను. తగ్గేందుకు మూడు రకాల మందులు రాశారు. ఫార్మసీకి వెళితే రెండు రకాల మందులే ఉన్నాయని చెప్పారు. ఇదే విషయాన్ని వైద్యునికి చెబితే మూడోమందు వాడే అవసరం లేదని దాన్ని తొలగించి ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చారు. అన్ని మందులు ఉండడం లేదు. ఉన్న మందులనే రాస్తున్నారంటున్నారు మరో వ్యక్తి

No comments:
Write comments