డీఈవో ఆఫీసులో బతుకమ్మ

 

నాగర్ కర్నూలు  సెప్టెంబర్ 27 (globelmedianews.com)
నాగర్ కర్నూల్ జిల్లా డీఈవో కార్యాలయంలో  బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకలలో పట్టణ కేంద్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు వివిధపాఠశాలల మహిళా ఉపాధ్యాయులు  మహిళా అధికారులుకలసి  నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో ఉత్సహంగా పాల్గొన్నారు. 
డీఈవో ఆఫీసులో బతుకమ్మ

జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఏడి అశోక్ ఏసీరాజశేఖర్ రావు నోడల్ అధికారి కురుమయ్య మహబూబ్ నగర్ ఏమ్ఈఓ జయశ్రీ సెక్టోరల్ అధికారులు యశోదారెడ్డి, కృష్ణా రెడ్డి, శివ, శ్రీనివాసాచారి ఈశ్వరప్ప, కార్యాలయ సిబ్బందిబతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో  మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పండుగలు వాటివిశిష్టత తెలియజేయడం కోసం ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డి ఓ కార్యాలయం ఆవరణ నుండి ప్రారంభమైన బతుకమ్మల ఊరేగింపు విద్యార్థులనృత్యాలతో శోభాయమానంగా నిర్వహించిన అనంతరం నాగర్ కర్నూల్ చెరువులోనిమజ్జనం చేశారు.

No comments:
Write comments