లారిని ఢీ కొన్న ఇంద్ర బస్సు.. డ్రైవరు మృతి పలువురికి గాయాలు

 

అనంతపురం సెప్టెంబర్ 28, (globelmedianews.com)
పెనుకొండ మండలం పులేకమ్మగుడి ఆర్టీఓ చెక్ పోస్ట్ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ముందు ఆగి వున్న లారిని వేగంగా వచ్చిన ఇంద్ర బస్సు  వెనుక నుండి ఢీ కొంది. ఘటనలోఇంద్ర బస్ .డ్రయివరు మృతి చెందాడు. 
లారిని ఢీ కొన్న ఇంద్ర బస్సు.. డ్రైవరు మృతి పలువురికి గాయాలు

పలువురికి గాయాలు అయ్యాయి. నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసి ఇంద్ర బస్సు నంద్యాల నుండి 15 మంది ప్రయాణికులతో బెంగళురు వెళ్తోంది.పెనుకొండ సమీపంలోని పులేకమ్మగుడి కి దగ్గరలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో డ్రయివరు పి యస్ వలీ మృతి చెందగా 14 మంది ప్రయాణిలకుస్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాదం జరిగిన తీరును హిందుపురం డిపో మేనేజర్ శంకర్పరిశీలించారు.

No comments:
Write comments