ఆలస్యంగా చెరువల్లోకి మత్స్య సంపద

 

ఖమ్మం, సెప్టెంబర్ 6, (globelmedianews.com)
ఉభయ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. లక్ష్యం బాగున్నా సకాలంలో అది అమలు కావడం లేదు. నిండు వర్షాకాలంలో చేపపిల్లలను వదిలితే చలికాలం వరకు కాస్త ఎదిగి వేసవి వరకు పట్టుకునేలా అందుబాటులోకి వస్తాయి. తొలకరి వర్షాలకు కొత్తనీరు, క్రిమికీటకాలు చేరడం వల్లపిల్లలు త్వరగా ఎదుగుతాయి. ఆలస్యంగా వదిలిన పిల్లలు ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీటిని కప్పలు, పెద్ద చేపలు తినడం, ఇతర వ్యాధులతో మృతి చెందే అవకాశం ఉంటుంది.వర్షాకాలం నీరు పారుతుంది కాబట్టి వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. వర్షాలు తగ్గి చెరువులో నీరు నిలిస్తే వైరస్‌ వ్యాపిస్తుంది. చెరువులో నీరు పారకుంటే వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తిచెందుతాయి. 
ఆలస్యంగా చెరువల్లోకి మత్స్య సంపద

ఆలస్యమయ్యే కొద్దీ చెరువులో కలుపు మొక్కలు వృద్ధి చెందడం కూడా చేపపిల్లల పెరుగుదలకు అడ్డుగా ఉంటుంది. కాబట్టి నిండు వర్షాకాలంలో వేసిన పిల్లలే అధికంగామనగలుగుతాయి. కానీ ఉభయ జిల్లాల్లో నేటికి చేప పిల్లల పంపిణీ ప్రక్రియ చేపట్టలేదు. అదును దాటిన తర్వాత వేస్తే ఎదుగుదలకు ఆటంకం కలిగే అవకాశం ఎక్కువగా ఉందని మత్స్యకారులుపేర్కొంటున్నారు.80-100 ఎం.ఎం పరిమాణం కలిగిన చేపలను శాశ్వత నీటి సామర్థ్యం ఉన్న చెరువుల్లోనే వదులుతారు. చెరువు విస్తీర్ణానికి అనుగుణంగా ఒక హెక్టార్‌కు 2 వేల చేపపిల్లలనువదులుతారు. అవి కొత్తగూడెం నియోజకవర్గంలో 6 చెరువులు ఉండగా 11.47 లక్షలు చేపలను వదలనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 10 చెరువుల్లో 19.44 లక్షలు, భద్రాచలంలో 2చెరువుల్లో 10.47 లక్షలు, పినపాకలో 12 చెరువుల్లో 17.65 లక్షలు, ఇల్లెందులో 8 చెరువుల్లో 6.46 లక్షలు, వైరా నియోజకవర్గంలో ఒక చెరువులో 1.95 లక్షల చేపలను వదులనున్నారు.జిల్లాలోచేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తిఅయింది. ఈసారి పోటీ అధికంగా ఉండడంతో గత సంవత్సరం కన్న తక్కువ ధరకే టెండర్ల దఖాలు అయ్యాయి. అధిక వర్షాల పలు చెరువుల్లోనీరు అలుగుపోశాయి. ఈ సమయంలో చేపల పంపిణీ చేసిన ఇబ్బందులు ఏర్పడుతాయి. అంతేకాకుండా మత్స్యకారులకు రాయితీ యూనీట్ల పంపిణీ కూడా చేపట్టాల్సి ఉందంటున్నారు అధికారులు

No comments:
Write comments