ఇసుక పరిస్థితి దారుణం

 

పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు
అమరావతి సెప్టెంబర్ 26, (globelmedianews.com)
గురువారం నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో  టెలికాన్ఫెరెన్సు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమూ అతి తక్కువ కాలంలో ఇంతఅప్రతిష్ట పాలు కాలేదు. కావాలని మనపై బురదాచల్లాలని చూసి ఆ బురద జగనే పూసుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. పీపీఏ ల పై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖలే దీనికిఉదాహరణలు. పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారు. పోలవరం 750కోట్లు తగ్గించామని చెప్పుకుని 7500కోట్లు నష్టం చేకూర్చారని అన్నారు. 
ఇసుక పరిస్థితి దారుణం

ఎలక్ట్రిక్ బస్సుల క్విడ్ ప్రోకో లోభాగంగానే..., పొలవరంకి గతంలో ఎక్కువ ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేసింది. మెగా కు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్ర బాబుఅడ్డుపడితే ఆయన్ని తప్పించారని అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి దోచుకోటానికి శ్రీకారం చుడుతున్నారు. వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదు. ప్రయివేటు సంస్థముందుకొచ్చి తీస్తామన్నా వారికి అనుమతివ్వటం లేదు. ఇసుక పరిస్థితి దారుణంగా ఉంది. ఇసుక కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరోవైపు,  తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదలమయం చేస్తున్నారు. అన్నింటిపైనా గట్టిగా పోరాడదామని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

No comments:
Write comments