కెమికల్ రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం

 

హైదరాబాద్ సెప్టెంబర్ 21, (globelmedianews.com)
ఓ కెమికల్ కంపెనీలో కెమికల్ రసాయనాలు కలుపుతుండగా రిఆక్షన్ అయి మిస్ ఫైర్ అవడం తో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలోచోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసు పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కార్తకేయ కామక్షి కెమికల్ కంపేనిలో అగ్నిప్రమాదం సంభవించింది.  ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో కంపెనీసిబ్బంది కెమికల్ రసాయనాలు కలుపుతుండగా రియాక్షన్ అయి మిస్ పైర్ కావడంతో రియాక్టర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. 
కెమికల్ రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం

ఒక్క సారి పెద్ద శబ్దం వచ్చి మంటలు రావడంతో సిబ్బంది కంపెనీబయటకు పరిగెత్తారు. జీడిమెట్ల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వారు ఐదు  ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. పైర్ అదుపులోకి తెచ్చే సమయంలో పైర్ సిబ్బంది ఒకరి  కాలుకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం స్దానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరుగ లేదు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని, కంపెనీకి ఫైర్ సేఫ్టీలేకపోవడంతో మంటలు తీవ్ర రూపం దాల్చాయని తెలుస్తుందని, విచారణ చేసి తగిన చర్యలు చేపడుతామని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

No comments:
Write comments