వైసీపీ కార్యకర్తల కోసం లక్షలాది ఉద్యోగాల భర్తీ..

 

మాజీమంత్రి జవహర్
ఏలూరు సెప్టెంబర్ 21 (globelmedianews.com):
గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని మాజీమంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో  ఏపీపీఎస్సి ని దళారుల అడ్డాగా మార్చితే వై.ఎస్.జగన్ అవినీతి కూపంలా మార్చారన్నారు.రాష్ట్రంలో 19,50,630మంది నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడి కోచింగ్ సెంట్రళ్లలో చదివితే పేపర్ల లికేజీతో వాళ్ళ జీవితాలను నాశనం చేశారని జవహర్ ఆగ్రహించారు. 
వైసీపీ కార్యకర్తల కోసం లక్షలాది ఉద్యోగాల భర్తీ..

బాల్యం నుంచి జగన్మోహన్రెడ్డికి,శ్రీకాంత్ రెడ్డికి పాఠశాలల్లో పరీక్ష పేపర్లు అపహరించటం అలవాటే అంటూ మండిపడ్డారు. ఏపీ పీఎస్సిలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులతో పేపర్లు తయారు చేయిస్తే మొదటి ర్యాంకులు రాకుండా ఉంటాయని జవహర్ ప్రశ్నించారు.గ్రామ సచివాలయ పరీక్షకు ఐ.ఏ.ఎస్ ఇవ్వాల్సిన సామర్ధ్యంతో తయారు చేసిన ప్రశ్నలు వచ్చాయని, 50 శాతం మార్కులు రావని భావించినవారికి 110 మార్కులు ఎలా వచ్చాయని ఆగ్రహించారు. సచివాలయ పరీక్ష పేపర్ల లికేజుపై ప్రత్యేక బృందంతో విచారణ చేయాలని మాజీమంత్రి జవహర్ డిమాండ్ చేశారు.

No comments:
Write comments