దురదకుంట లో రైతుపై మూడు ఎలుగుబంట్లు దాడి

 

అనంతపురం సెప్టెంబర్ 28, (globelmedianews.com)
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన రైతు కరెన్న పై మూడు ఎలుగుబంట్లు దాడి చేశాయి. శనివారం తెల్లవారుజామన తన తోటలోకి వ్యవసాయపనికి వెళ్లగా, అక్కడ దాగివున్న   మూడు ఎలుగుబంట్లు రైతు కరెన్న పై ఒక్కసారిగా దాడి చేశాయి . చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దాడికి గురయ్యాడు . ఈ ప్రమాదంలో రైతుశరీరంపై ఎలుగుబంటి కాట్లు వేసింది.  తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న కరెన్న ను  గమనించిన గ్రామస్తులు  కళ్యాణదుర్గం అర్దీటి ఆసుపత్రికి  తరలించారు . 
 దురదకుంట లో రైతుపై మూడు ఎలుగుబంట్లు దాడి

అక్కడ పరిస్థితి విషమించడంతోఅనంతపురం తీసుకెళ్లారు.  ఊరి చివరన ఉన్న కొండల్లో పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు ఉన్నాయి.  చుట్టుపక్కల పొలాల్లో రైతులు పగటిపూట కూడా ఒక్కొక్కరుగా వెళ్ళడానికి వీలులేని పరిస్థితి ఉంది.  ఈ నేపథ్యంలో రైతు పై దాడి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని మహిళా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకొనిఎలుగుబంట్లును సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు  కోరుతున్నారు.

No comments:
Write comments