సామాజిక కవి జాషువా

 

మంత్రి శంకరనారాయణ
అనంతపురం, సెప్టెంబర్ 28, (globelmedianews.com)
గుర్రం జాషువా సామాజిక కవి అని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. శనివారం అనంతపురం పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలోనే మహాకవిగుర్రం జాషువా 124వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను కవితా వస్తువుగా చేసుకొని విలక్షణమైన కవితా మార్గాన్ని ఏర్పరుచుకున్నకవి గుర్రం జాషువా ని తెలిపారు. 
సామాజిక కవి జాషువా

తెలుగు సాహిత్యంలో దళితుల దయనీయ స్థితిని సాహిత్య వస్తువుగా తీసుకుని అనేకమంది కవులు తమ రచనల ద్వారా అనగారిన వర్గాల ఆత్మగౌరవ అభివృద్ధికి కృషిచేసి, వారిలో చైతన్యం రగిలించడానికి ప్రయత్నించిన గొప్ప కవులలో గుర్రం జాషువా ముందువరుసలో ఉన్నాడని తెలిపారు .1895 సెప్టెంబర్ 28 న వీరయ్య,లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లాలో వినుకొండలో జన్మించారు . వివిధ సామాజిక సమస్యలను కూడా ప్రత్యేక రచనలు చేసి జాషువా పాండిత్యానికి నిదర్శనంగా నిలిచారు. భారతప్రభుత్వం 1970 లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది అని.1971 లో జూలై 24వ తేదీన గుర్రం జాషువా మరణించారని. ఆయన కవిత్వం మాత్రమే తెలుగు పాఠకులహృదయాలలో చిరకాలం సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగ లింగన్న, కృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయ తెలుగు విభాగ పతి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి, వివిధ దళిత సంఘాల నాయకులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments