సా...గుతున్న సర్వే (విశాఖ)

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 11 (globelmedianews.com): 
ప్రజా సాధికార సర్వే (పీఎస్‌ఎస్‌) ఇంకా ఊపందుకోలేదు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 3 వేల మంది వివరాలు కూడా నమోదు కావడంలేదు. దీంతో ఈప్రక్రియను వేగవంతం చేయడంపై పౌరసరఫరాల శాఖ యంత్రాంగం దృష్టి సారించింది. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా 2,63,367 మంది పేర్లు, వివరాలు సర్వేలో చేరాల్సి ఉంది. వీరి వివరాలనుసిద్ధంచేసి రేషను డిపో డీలర్ల ద్వారా ఆయా వ్యక్తులకు చేరవేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల తహసీల్దార్‌, పట్టణ/నగర ప్రాంతాల్లో జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాల్లోపీఎస్‌ఎస్‌ల నమోదుకు కేంద్రాలున్నాయి. 
సా...గుతున్న సర్వే (విశాఖ)

ఆయా చోట్ల వేలిముద్రల సహాయంతో పీఎస్‌ఎస్‌ యాప్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,18,113 మంది ప్రజాసాధికారసర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోలేదు. వీరిలో గత 20 రోజుల నుంచి దాదాపు 54 వేల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇంకా 2.63 లక్షల మంది మిగిలారు. వీరిలోనగర పరిధిలో 1.30 లక్షలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 1.33 లక్షల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మండల కేంద్రాల్లో ఉన్న పీఎస్‌ఎస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. నగరప్రాంతంలోని కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ప్రజా సాధికార సర్వేలో నమోదైన వివరాలను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకోనుంది.దీంతో ప్రతి ఒక్కరూ పీఎస్‌ఎస్‌లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీగా రేషను కార్డులు జారీ చేశారు. అప్పట్లోపీఎస్‌ఎస్‌లో పేర్లు నమోదు కాకున్నా ఇచ్చేశారు. దీంతో పీఎస్‌ఎస్‌ వివరాలు లేనివారి సంఖ్య భారీగా ఉంది. పౌరసరఫరాల శాఖ అధికారులు రేషనుకార్డుదారులను అప్రమత్తం చేస్తూ పీఎస్‌ఎస్‌నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల్లో సాధ్యమైనంత మేర వివరాల నమోదును పూర్తి చేయాలని భావిస్తున్నారు.

No comments:
Write comments