విత్తనాల టెండర్ల ఎంపిక పూర్తి

 

హైదరాబాద్ సెప్టెంబర్ 26  (globelmedianews.com)
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ వద్ద 12 వేల క్వింటాళ్ల విత్తనం, ఇంకా అవసరమయిన విత్తనాలు టెండర్ల ద్వారా ఎంపిక పూర్తయింది. సరఫరా చేయడం జరుగుతుందనిశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
- వేరుశనగ సాగు అధికంగా చేసే జిల్లాలు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాలలో విత్తనం అందుబాటులో ఉంచడం జరిగిందని,
- ప్రతి ఏడాది 35 వేల నుండి 40 వేల క్వింటాళ్లు పలు ఏజన్సీల ద్వారా రాయితీపై సరఫరా చేయడం జరుగుతుందని తెర్లిపారు.
విత్తనాల టెండర్ల ఎంపిక పూర్తి

- బయట మార్కెట్ లో ధర అధికంగా ఉంది, ప్రభుత్వ సబ్సిడీ (44.4%)ఎక్కువ ఉండడంతో ప్రభుత్వ విత్తనంపై రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు.ఈ ఏడాది డిమాండ్ మరింతపెరిగింది
- విత్తనాలు ప్రతి రైతుకు అందజేస్తామని, విత్తనాల సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు.-వేరుశనగ పంట వేయడానికి అక్టోబరు నెల ఆఖరు వరకు సమయం ఉంది
- ప్రస్తుతం పడుతున్న వర్షాలలో విత్తనం వేస్తే పంట మొలక దశలో దెబ్బతినే అవకాశం ఉంది- సాగునీరు సరిపడా ఉందన్నారు. వేరు శనగ సాగుకు రైతులు తొందరపడొద్దు- విత్తనాలు అవసరమైన రైతులు విక్రయ కేంద్రాలలో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాల వారీగా విత్తన డిమాండ్ ను ప్రభుత్వం సమీక్షిస్తూ అధికారులకు సూచనలు అందిస్తుందనితెలిపారు.

No comments:
Write comments