జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి సైకిల్ యాత్రకు మద్దతు

 

40 రోజుల్లో 4 వేలకు పైగా కిలోమీటర్లు.. 14 రాష్ట్రాల మీదుగా ప్రయాణం
నెక్లెస్ రోడ్డుకు చేరుకున్న యాత్రకు చల్లా వంశీచంద్ రెడ్డి, పురుషోత్తం రెడ్డిల మద్దతు
హైదరాబాద్ సెప్టెంబర్ 09  (globelmedianews.com)
వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది కలకొండ సంతోష్ కుమార్ తలపెట్టిన జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఎఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి  సంఘీభావం తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె. పురుషోత్తం రెడ్డి తదితరులు సైకిల్ యాత్ర సందర్భంగా మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని అనంతరం ఆర్మీ వార్ మెమోరియల్ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి యాత్రకు సంతోష్ కుమార్ శ్రీకారం  చుట్టారనీ వారు తెలిపారు. 
జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి సైకిల్ యాత్రకు మద్దతు

ఈ  సైకి ల్ యాత్ర 14 రాష్ట్రాల మీదుగా 4వేలకు పైగా కిలోమీటర్ల దూరం కొనసాగిందని, జమ్మూ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీ్సఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా కొనసాగిన ఈ యాత్ర సెప్టెంబర్ 22వ తేదిన కన్యాకుమారిలో ముగీయనుందని పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కు చేరుకున్న యాత్రకు తాము సంఘీభావం ప్రకటించామన్నారు. మహనీయులను యువత స్పూర్తిగా తీసుకోవాలని యాత్ర చేపట్టారు.  ప్రతిరోజు సగటున వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించి సాహసోపేతమైన యాత్ర చేపట్టిన సంతోష్ కుమార్ ను అభినందించినట్టు పురుషోత్తం రెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి జితేందర్, శివసేన, శ్యామ్ గౌడ్, శంకర్ రాథోడ్, సయ్యద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments