వెదురు సాగుపై సర్కార్‌ దృష్టి

 

రంగారెడ్డి, సెప్టెంబర్ 19, (globelmedianews.com)
ఏనాడో కళ కోల్పోయిన వెదురు కళాకృతులు ఈ మధ్యే పూర్వ వైభవం దిశగా వెళ్తున్నాయి. కాలానికి తగ్గట్టు… కళకు సాంకేతికతను జోడించి తయారు చేసిన వెదురు ఉత్పత్తులకు మార్కెట్లో మంచిడిమాండ్ ఉంది. వెదురు సాగుపై సర్కార్‌ దృష్టిసారించింది. వెదురుకు డిమాండ్‌ ఉన్న దృష్ట్యా రైతులను సాగు చేసేలా ప్రోత్సహిస్తుంది. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. రైతులకు నికరఆదాయం పెంచడం.. స్వయంగా సహాయ బృందాల మహిళలు, వృత్తిదారుల్లో నైపుణ్యాలు పెంపొందించే దిశగా ఉద్యాన శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వ్యవసాయ అనుబంధంగా వెదురు సాగు చేసేలాఉద్యానవన శాఖ ముందుకు సాగుతుంది. 
వెదురు సాగుపై సర్కార్‌ దృష్టి

జిల్లాలో మొదటి విడతగా 15 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వెదురును అదిలాబాద్‌, ఖమ్మంలో ఎక్కువగాపెంచుతున్నారు. ఇసుకతో కూడిన బంకమన్ను, ఎర్రనేల, నల్లరేగడి నేలలు అనుకూలం. రైతులు పొలం గట్లపై నాటుకోవచ్చు. తోటలా పెంచుకోవాలనుకున్న వారు మొక్కకు మొక్కకు పొడవు 5,వెడల్పు 5 మీటర్ల దూరంతో ఎకరాకు 160 మొక్కలు నాటు కోవచ్చు. పొలాల్లో, పొలం గట్టపై పెంచేందుకు 2 మీటర్లు వెడల్పు, 2 మీటర్లు పొడవు దూరంలో నాటుకోవాలి. పొలంగట్లపై 130మొక్కలు నాటుకోవచ్చు. ఏడాదికి ఎకరాకు దిగుబడి 10-14 టన్నులు వస్తుంది. దీనికి ప్రభుత్వం 50 శాతం సబ్సిడి ఇస్తుంది. ఎకరాకు రూ.40 వేలు ఖర్చు అవుతుంది. 50 శాతం అంటే20 వేలు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మూడేళ్ల వరకు బతికిన మొక్కల ఆధారంగా సబ్సిడీ అందజేస్తుంది. అటవీ శాఖ నుంచి ఉచితంగా మొక్కలు లభించును. దీని కోసం మీ మండలాల్లోసంబంధిత ఉద్యాన అధికారిని సంప్రదించాలి. దరఖాస్తు చేసుకునే రైతు తమ ఆధార్‌ కార్డుతో పాటు బ్యాంకు పాస్‌పుస్తకం, పట్టాదారు బుక్‌ను జత చేయాల్సి ఉంటుంది.వెదురుతో గృహాలంకరణవస్తువులు, ఫర్నీచర్, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేసేవారు. ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఏకంగా ఇళ్లునే కట్టేశారు. మయూరీ ఎకో పార్క్ లో గెస్ట్ హౌస్ ను పూర్తిగా వెదురుతోనే నిర్మించి…పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు.ఇనుముకు బదులు వెదురు బద్దలను ఉపయోగించి గెస్ట్ హౌస్ నిర్మించారు. దీనికి బెంగళూరులోని ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ఇనిస్టిట్యూట్ తోడ్పాటు అందించింది. మహబూబ్ నగర్ కు చెందిన కొందరు మేదరులు ఐపీఆర్ టీఐ లో శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. ఇనుము, స్టీల్తో భవనం నిర్మిస్తే అయ్యే ఖర్చులో సగం ధరలోనే వెదురుతో ఇల్లు కట్టారు. వెదురుతో కట్టిన ఇంటితో మంచి లాభాలుంటాయంటున్నారు మేదరులు.స్టీల్, సిమెంట్ తో కట్టిన దానికన్నా మన్నికఎక్కువగా ఉండడం ఒకటైతే… వెదురు ఇంట్లో ఉష్ణోగ్రతలు కనీసం 10 డిగ్రీలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. సంప్రదాయ వృత్తికి సాంకేతికతతోపాటు, ఆధునిక నైపుణ్యాన్ని జోడించటంద్వారా అద్భుతాలు చేస్తున్నారు మేదరులు. ఈ కళారూపాల తయారీలో మహిళలు, పురుషులు అందరూ తయారు చేస్తూ ఎగ్జిబిషన్ల ద్వారా ఆదాయం పొందుతున్నారు. రాష్ట్రంలోని మిగతామేదరులకు కూడా ఇలా శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు

No comments:
Write comments