పోలీసుల పేరిట..నకిలీల దోపిడీలు...!

 

పట్టుకున్న పోలీసులు...!!
జగిత్యాల  సెప్టెంబర్10  (globelmedianews.com)
జిల్లా కేంద్రంలో పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డి.ఎస్.పి వెంకటరమణ తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసినవిలేకఖరుల సమావేశంలో డీఎస్పీ నిందితుల వివరాలు వెల్లడించారు.
పోలీసుల పేరిట..నకిలీల దోపిడీలు...!

ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎండీ. వసిమోద్దీన్,ఎండి అమీర్ ఖాన్,ఎండి ఇర్ఫాన్ లతో పాటు మరొకరు విలాసాల కోసంరహదారిపై వెళ్తున్న వారిని ఆటకాయించి దోపిడికి పాల్పడినట్లు తెలిపారు. వారిపై  ఫిర్యాదులు అందడంతో విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకోగా ఒకడు పరారీలో ఉన్నాడని తెలిపారు.వారి వద్దనుండి ఒక ద్విచక్ర వాహనం, ఒక కత్తి, రెండు సెల్ ఫోన్లు, 200 రూపాయల నగదు స్వాధీనం చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో జగిత్యాల టౌన్ సీఐ ప్రకాష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

No comments:
Write comments