ఇసుక దోపిడీ అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది

 

పారదర్శకమైన పాలన అందించేందుకు  పనిచేస్తున్నాం
పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ సెప్టెంబర్ 5  (globelmedianews.com)
గురువారం కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద ప్రభుత్వం అధ్వర్వంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మైలవరంశాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు, నందిగామ శాసనసభ్యులు మెండితోక జగన్మోహనరావు ప్రారంభించారు. 
ఇసుక దోపిడీ అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మాట్లాడుతూ గత పాలకులు మాదిరిగాఉచితం అనే పేరుతో దోపిడి చేయటం లేదన్నారు. పారదర్శకమైన పాలన కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సా ర్కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

No comments:
Write comments