రోగులకు సరైన సేవలు అందిస్తున్నాం: మంత్రి ఈటెల రాజేందర్

 

హైదరాబాద్ సెప్టెంబర్ 6 (globelmedianews.com)
గాంధీ అస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఈటెల రాజేందర్ లు పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల గాంధీ ఆస్పత్రిలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ఆస్పత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
రోగులకు సరైన సేవలు అందిస్తున్నాం: మంత్రి ఈటెల రాజేందర్

అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు వస్తున్నాయి. రోగులకు సరైన సేవలు అందించేందుకు వైద్యులు, ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని చోట్లా మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన సెమినార్ హాలు, లైబ్రరీని మంత్రులు ప్రారంభించారు.

No comments:
Write comments